ఆముదాల నూనెతో మీ జుట్టుకు ఉడుంపట్టు, ఇలా వాడారంటే ఒత్తైన పొడువు జుట్టు మీ సొంతం.

ఆముదం గింజల నుంచి ఈ నూనెను తయారు చేస్తారు. ఈ నూనె మాడుకు తగిన పోషణను అందించి జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఆముదంలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తలలో ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడే దురద, మంట వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఆముదంలో రిసినోలియెక్ ఆమ్లం అధికంగా ఉంటుంది.
ఈ ఆమ్లం మాడు రక్తప్రసరణను మెరుగుపరిచి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. అయితే వయసు పెరిగే కొద్దీ తలపై వెంట్రుకలు కూడా రాలిపోతుంటాయి. దీంతో బట్టతల సమస్య పెరిగిపోతుంది. శిరోజాల సంరక్షణలో ఆముదం సహాయపడుతుందని సౌందర్య నిపుణులు అంటున్నారు.
ఐతే ఆముదంను సరైన పద్ధతుల్లో మాత్రమే తలకు పట్టించవల్సి ఉంటుంది. ఆముదం శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.ఆముదం నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
ఈ నూనె మాడుకు పట్టిస్తే చుండ్రు సమస్య ఇట్టే నయం చేస్తుంది. అలాగే జుట్టులో తేమను నిలుపుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఆముదంతో తలపై మసాజ్ చేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది.
ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అంతేకాకుండా తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. తగినంత కొబ్బరి నూనెతో కొన్ని చుక్కల ఆముదం నూనె కలిపి తక్కువ సెగపై వేడి చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నూనెతో తలపై మసాజ్ చేసి గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.