మోచేయికి దెబ్బ తగిలినప్పుడు కరెంట్ షాక్‌లా ఎందుకు ఉంటుంది. కారణం ఏంటో తెలుసా..?

మన బాడీలో ఎన్నో నరాలు ఉంటాయి. అవన్నీ శరీరంలోని వివిధ భాగాలను అనుసంధానిస్తూ చివరికి మెదడుకి చేరి మళ్ళీ అక్కడ నుండి శరీరంలోని అన్ని భాగాలకు అనుసంధానమవుతుంది. ఈ నరాలన్నిటినీ కండరాలు, ఎముకలు కవర్ చేస్తూ ఉంటాయి. అందుకు మనకి ఎక్కడైనా దెబ్బ తగలగానే కండరాలకు, ఎముకలకు దెబ్బ తగలడంతో నొప్పిగా ఉంటుంది. అయితే, ఒక్క మోచేతి మీద దెబ్బ తగిలితే మాత్రం జివ్వు మంటుంది.
దీనికి కారణం మోచేతి మీద నరానికి ఎలాంటి ఎముక కానీ కండరాలు కానీ రక్షణ ఉండవు. కేవలం నరం మీద చర్మం మాత్రమే ఉంటుంది. అందుకే దెబ్బ తగలగానే అది డైరెక్ట్ గా నరానికి తగులుతుంది. అయితే మోచేయి నుండి భుజం వరకు వెళ్ళే ఎముకను సాధారణంగా ఇంగ్లీష్‌లో హ్యూమరస్ అంటారు. ఈ మోచేయి షాక్‌గా అనిపించడానికి ఒక నిర్దిష్ట కారణం ఉంది.
ఇది చాలా వివరణాత్మక శాస్త్రీయ వివరణను కలిగి ఉంది. మోచేతి ఎముకలు, సాధారణంగా ఫన్నీ బోన్స్ అని కూడా పిలుస్తారు. అవి గట్టి ఉపరితలంపై కొట్టిన వెంటనే విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. దీని వెనుక ప్రధాన కారణం మోచేయి గుండా వెళ్ళే అల్నార్ నర్వ్. మన మోచేతి దగ్గర బొడుపులా ఉన్న ఎముక పక్కనుండి ఈ నరం వెళ్తుంది.
అది మెదడు నుంచి మొదలై మోచేతి ఎముక దగ్గర్నుంచి చేతివేళ్ళలోకి వెళ్ళే సర్వైకల్ నరాల్లో ఒకటి. ఒకవేళ కనుక పొరపాటున అక్కడ దెబ్బ తగిలితే మెదడు సిగ్నల్స్ ని మోచేతి నుంచి అరచేతిలోకి పాకడం వల్ల ఈ ఫన్నీ బోన్ పెయిన్ అనేది కలుగుతుంది. ఇది ఎముకకు దెబ్బ అని మనం పొరపాటుగా అనుకుంటాము. కానీ వాస్తవానికి ఇది ఉల్నార్ నాడి ప్రతిస్పందిస్తుంది.
ఏదైనా తగిలిన వెంటనే, న్యూరాన్లు మన మెదడుకు సంకేతాలను పంపుతాయి. ప్రతిస్పందన విద్యుత్ ప్రవాహంలా ఉంటుంది. ఇది జరిగినప్పుడు కొందరు వ్యక్తులు జలదరింపు, చక్కిలిగింత అనుభూతిని అనుభవిస్తారు. ఇది సాధారణంగా మన శరీరంలోని ఎముకలు, నరాలను రక్షించే కొవ్వు పొర వల్ల వస్తుంది. కాబట్టి, తదుపరిసారి ఇలాంటివి జరిగినప్పుడు, దాని వెనుక ఉన్న కారణం మీకు ఇప్పటికే తెలిసిపోతుంది.