News

హీరోయిన్ అంజలిని సడెన్‌గా స్టేజ్‌పైకి నెట్టేసిన బాలకృష్ణ, వైరల్ వీడియో

విశ్వక్ సేన్ కథానాయకుడిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.. గోదావరి తీరప్రాంత రాజకీయాలే అంశంగా తీసిన ఈ సినిమాలో నేహాశెట్టి కథానాయికగా నటిస్తోంది.. ఈ సినిమాకి, కృష్ణచైతన్య దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగవంశీ – సాయిసౌజన్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ – మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నారు ఈ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అయితే అసలు ఏం జరిగిదంటే.. స్టేజ్ మీద బాలకృష్ణ, నేహాశెట్టి, అంజలి పక్క పక్కన నిల్చొని ఉన్నారు. బాలకృష్ణ.. అంజలిని కాస్త పక్కకు జరగమని చెప్పాడు. ఆమె కొంచం పక్కకు జరిగింది. ఇంకోసారి జరగమని చెప్పకుండా ఒక్క తోపు తోశాడు. వీళ్ల మధ్యలో ఉన్న నేహాశెట్టి కూడా ఒక్కసారిగా షాకైంది. కానీ, అంజలి- నేహా శెట్టి నవ్వుతూనే ఉన్నారు. కాసేపు బాలయ్య ముఖం మాత్రం సీరియస్ గా కనిపించింది. కానీ, వెంటనే నవ్వేశాడు. అలాగే అంజలితో మళ్లీ ఏదో మాట్లాడుతూ కనిపించాడు.

ఆమె కూడా నవ్వుతూ బాలయ్యకు సమాధానం చెప్పింది. అలాగే బాలకృష్ణ తర్వాత అంజలికి నవ్వుతూ హైఫై కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంజలి ఆ విషయాన్ని సరదాగానే తీసుకున్నా.. నెటిజన్స్ మాత్రం కాస్త సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు. కొందరైతే బాలయ్యకు అస్సలు ఎలా ప్రవర్తించాలో తెలియదు అంటూ కాస్త ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు. ఇంకొందరు ఆ సందర్భంలో అంజలి ఏడవలేక నవ్వుతూ కవర్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బాలయ్య బాబు అభిమానులు మాత్రం ఈ చర్యను కూడా సమర్థిస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా బాలయ్య.. బాలయ్యే అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట హల్చల్ చేస్తోంది. బాలకృష్ణ హీరోయిన్ అంజలిని తోయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker