News

అంత్యక్రియల తర్వాత తల స్నానం ఎందుకు చేస్తారు. దీని వెనక అంత సైన్స్‌ ఉందా..?

పెళ్లిళ్లకు వెళ్లకున్నా సరే చావుల కు వెళ్లాలి అని అంటూ ఉంటారు. అయితే చనిపోయిన వారిని చూడడానికి వెళ్ళినప్పుడు.. చనిపోయిన వారి శరీరం బ్యాక్టీరియాతో పోరాడగలిగే శక్తి వుండదు. ఫలితంగా అంత్యక్రియల సమయంలో వారి శరీరంలోని బ్యాక్టీరియా మన శరీరంపై కి చేరుకునే ఆస్కారం వుంటుంది. అంత్యక్రియల తర్వాత ఎవరిని తాకకూడదు.. ఇంట్లోకి ప్రవేశించకూడదు అంటారు కారణం ఈ బ్యాక్టీరియా.. అందుకే అంత్యక్రియల నుంచి వచ్చిన తర్వాత నేరుగా స్నానం చేసిన తర్వాత ఇంట్లో కి వెళ్ళాలి.

అయితే పూర్వం దగ్గర్లోని కాలువ లేదా చెరువు వద్దకు వెళ్లి తల స్నానం చేస్తారు. ఇప్పుడు స్నానం చేసేందుకు స్మశాన వాటికల్లోనే పంప్స్, బోర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇలా స్నానం చేయడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఆత్మీయులు చనిపోయినప్పుడు దు:ఖం తన్నుకువస్తుంది. ఆ మనిషితో గడిపిన క్షణాలు, చేసుకున్న జ్ఞాపకాలు, పంచుకున్న మాటలు గుర్తుకు వస్తాయి. ఇక వారు మనతో ఉండరు అనే ఆలోచన మన శరీరంలోని అణువణువునూ బాధిస్తుంది. కొంతమంది గుక్కెట్టి ఏడుస్తారు.

మరికొందరు పంటిబిగువున బాధను భరిస్తూ.. లోలోపల కుంగిపోతారు. ఆ సమయంలో మెదడు, శరీరంపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అలాంటి సమయంలో తల స్నానం చేయడం వల్ల కొంతమేర స్వాంతన లభిస్తుంది. హిందువుల్లో చాలామంది శ్మశాన వాటికలో ప్రతికూల ప్రభావం ఉంటుందని భావిస్తారు. చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహించిన తర్వాత.. ఆ ప్రతికూల భావనలను మన నుంచి తొలగించుకోవడానికి స్నానం చేయాలని అంటారు. వ్యక్తి మరణించిన వెంటనే అంత్యక్రియలు చేయరు.

బంధుమిత్రులు అందరూ వచ్చేవరకు మృతదేహాన్ని అలానే ఉంచుతారు. ఈ సమయంలో ఆ బాడీలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ శరీరాన్ని తాకిన వారికి అది స్ప్రెడ్ అవుతుంది. అందుకే.. చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహించిన తర్వాత స్నానం చేయాలని చెబుతుంటారు. పూర్వ కాలంలో ఎక్కువగా అంటు వ్యాధులతో జనాలు చనిపోయేవారు. ఆ రోగాలు ఇతరులకు సోకకుండా ఉండటానికి, దహన సంస్కారాల తర్వాత స్నానాన్ని ఆచార, సంప్రదాయాల్లో భాగం చేశారని పూర్వికులు చెబుతుంటారు.

మనకు కావాల్సినవారు చనిపోతే ఎవ్వరైనా షాక్‌ గురవుతారు. ఆ బాధ నుంచి కోలుకోవడంలో తల స్నానం ముఖ్యపాత్ర పోషిస్తుందని చెబుతుంటారు. ఆ సమయంలో తలస్నానం చేయడం వల్ల.. ఆ జ్ఞాపకాలను కొంత వరకు పక్కనపెట్టే అవకాశం కలుగుతుందట.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker