News

చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు, దీంతో మెగాస్టార్ కి అవన్నీ ఫ్రీగా ఇస్తారా..?

మెగాస్టార్ చిరంజీవితోపాటు.. మాజీ ఊపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ‘పద్మ విభూషణ్’ అవార్డును ప్రకటించింది కేంద్రం. దీంతో వీరిద్దరికి సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో పద్మ విభూషణ్ అవార్డ్ కేవలం ఒక్క హీరోకు మాత్రమే వచ్చింది. ఆ తర్వాత ఈ అవార్డ్ అందుకున్న హీరో మెగాస్టార్ కావడం విశేషం.

అయితే పద్మ అవార్డులు అనేవి ఓ గౌరవంగా మాత్రమే మనం గుర్తించాలి. పద్మ అవార్డులు వచ్చిన వ్యక్తులకు ఎలాంటి నగదు కానీ, రాయితీలు కానీ ఇవ్వరు. రైలు, విమాన ప్రయాణాల్లో కూడా ఎలాంటి రాయితీలు, ఉచితాలు ఉండవు. అయితే పద్మ అవార్డులు అందుకున్న ప్రముఖులు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంటుంది. ఇక ఈ అవార్డులు పొందిన వారికి రాష్ట్రపతి సంతకంతో ఉన్న ధృవీకరణ పత్రం, మెడల్ బహూకరిస్తారు.

ఇదిలా ఉండగా.. సినీ రంగానికి చేసిన సేవలకుగానూ మెగాస్టార్ కు 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును ప్రధానం చేసింది. ఇక ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. కాగా.. మెగాస్టార్ 2006 సంవత్సరంలోనే సౌత్ ఫర్ హానరరీ యాక్టింగ్ కెరీర్ పేరిట ప్రత్యేక అవార్డును ఫిల్మ్ ఫేర్ వేడుకల్లో అందుకున్నాడు. వీటితో పాటుగో ఎన్నో పురస్కారాలను దక్కించుకున్నాడు మన మెగాస్టార్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker