News

య్యూటుబర్‌ టేస్టీ తేజాకి హార్ట్ అటాక్, తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..?

య్యూటుబర్‌గా టేస్టీ తేజ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే బిగ్‌బాస్ నుంచి పిలుపు రావడంతో ఆయన సన్నిహితులు, మీడియా వర్గాలు హ్యాపీగా ఫీలయ్యాయి. అయితే బిగ్‌బాస్ నుంచి అనుకోకుండా వచ్చిన క్రేజ్‌తో ప్రస్తుతం మీడియా, యూట్యూబ్ వారిని కించపరిచే విధంగా మాట్లాడుతుండటం వివాదంగా మారింది. అయితే తాజాగా తేజాకి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. తేజాకి హార్ట్ అటాక్ వచ్చింది అంటూ నెటిజన్స్ చెబుతున్నారు.

అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రియాంక జైన్, శివకుమార్ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. ప్రియాంక జైన్ వాళ్ల ఇంట్లో పని చేస్తున్న తేజా ఒక్కసారిగా గుండె పట్టుకుని కుప్పకూలిపోతాడు. ప్రియాంక ఎంతో కంగారు పడుతూ అంబులెన్స్ ని పిలవండి అంటూ శివకుమార్ మీద కేకలు వేస్తుంది. ఆ తర్వాత శివకుమార్ ఏదో నానుస్తూ తీసుకెళ్దాంలో అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ప్రియాంక సీరియస్ కూడా అవుతుంది. అయితే నిజంగానే తేజాకి హార్ట్ అటాక్ వచ్చిందా అంటే రాలేదని చెప్పాలి.

ఎందుకంటే ప్రియాంక మీద ప్రాంక్ చేయడానికి శివకుమార్ తేజాతో కలిసి ఇలా ప్లాన్ చేశాడు. ప్రస్తుతం వీళ్ల ప్రాంక్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఒకరిపై ఒకరు ఇలా ప్రాంకులు చేసుకోవడం ప్రియాంక- శివకుమార్ కి అలవాటే. కాకపోతే ఈసారి తేజాని ఇన్వాల్వ్ చేయడంతో కథ మరింత రసవత్తరంగా మారింది. మరి.. ప్రియాంకపై ప్రాంక్ చేయడానికి హార్ట్ అటాక్ వచ్చినట్లు చేసిన తేజాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker