News

ఏజ్ బార్ నిర్మాతతో అనుష్క పెళ్లి, ఆ బడా నిర్మాత ఎవరో తెలుసా..?

అనుష్క-ప్రభాస్ కలిసి నాలుగు చిత్రాలు చేశారు. బిల్లా చిత్రం కోసం మొదటిసారి కలిసిన ఈ స్టార్స్.. మిర్చి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో జతకట్టారు. ఈ క్రమంలో ఎఫైర్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. త్వరలో పెళ్లి అంటూ మీడియా పలుమార్లు కథనాలు ప్రచురించింది. ఈ పుకార్లను ప్రభాస్-అనుష్క కొట్టిపారేశారు. అయితే అనుష్క శెట్టి ఆచితూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బాహుబలి, బాగమతి సినిమాల తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ ఇస్తున్నారు.

బాగమతి తర్వాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లి గురించి చాలా వార్తలు పుట్టుకొచ్చాయి. ఒక బిజినెస్ మ్యాన్ తో అనుష్క పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. అనుష్క శెట్టి తన గురించి తరచూ వార్తల్లో నిలుస్తోంది. మరి అనుష్క పెళ్లి ఎప్పుడు అనేది అభిమానులకు ప్రశ్నగా మిగిలిపోయింది. ఇదిలా ఉంటే అనుష్క శెట్టి గురించిన కొత్త గాసిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఓ బడా నిర్మాతతో అనుష్క పెళ్లి అంటూ టాక్ వినిపిస్తుంది. శాండల్‌వుడ్ నిర్మాతను అనుష్క పెళ్లి చేసుకోనుందని ప్రచారం జరుగుతుంది.మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియక అభిమానులు జుట్టుపీక్కుంటున్నారు. అనుష్క శెట్టి వయసు ఇప్పుడు 42 ఏళ్లు. ఇప్పటి వరకు పెళ్లి గురించి ఆమె ఊసెత్తలేదు. ప్రభాస్‌తో అనుష్క పెళ్లి చేసుకోబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తల్లో నిజం లేదు అని తేలింది. ఇప్పుడు అనుష్క శాండల్‌వుడ్ నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆ నిర్మాత ఎవరనే చర్చ సాగుతోంది. ఇప్పటికైతే నిర్మాత ఎవరనే విషయంపై క్లారిటీ లేదు. అనుష్క శెట్టి గురించి ఇంతకుముందు చాలా వార్తలు వచ్చాయి. కాబట్టి, ఇది కూడా ఓ రూమర్ మాత్రమే అని కొంతమంది అభిమానులు కొట్టిపారేస్తున్నారు. 2005లో విడుదలైన తెలుగు సినిమా ‘సూపర్’తో అనుష్క తన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘బాహుబలి’, ‘మిర్చి’, ‘అరుంధతి’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగు, మలయాళంలో సినిమాలు చేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker