News

అరుంధతి చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..? అస్సలు గుర్తుపట్టలేరు.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరైన దివంగత కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2009లో వచ్చిన అరుంధతి సినిమా ఎత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా విజయంతో అనుష్క శెట్టి స్టార్ డమ్ మరింత పెరిగింది. సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి అనుష్క శెట్టి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అరుంధతి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అరుంధతి సినిమాలో అనుష్క చిన్పప్పటి క్యారెక్టర్ లో నటించిన ఈ అమ్మాయి గుర్తుందా?

అరుంధతి సినిమాలో.. చిన్నప్పటి చిన్నారి అరుంధతి పాత్రలో గంభీర నటనతో అదరగొట్టిన ఈ అమ్మాయి పేరు దివ్య నగేష్. అయితే బాల నటిగా దివ్య నగేష్ చాలా సినిమాల్లో నటించింది. అరుంధతి సినిమాలో నటించిన తర్వాత ఈ అమ్మాయికి మరింతగా పాపులారిటీ దక్కింది. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో ఆ తర్వాత ఎక్కువ ఆఫర్లు రాలేదు.

పైగా వయసు పెరగడం వల్ల బాల నటిగా ఆఫర్లు రాలేదు. పెద్ద అయ్యాక హీరోయిన్ గా సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యింది. అది కూడా ఆమెకు కలిసి రాలేదు. రెండు మూడు సినిమాల్లో హీరోయిన్‌ గా నటించిన దివ్య నగేష్‌ సోషల్‌ మీడియాలో సందడి చేయడం తప్ప హీరోయిన్‌ గా పెద్దగా ప్రభావం చూపించలేక పోయింది. చిన్నారి అరుంధతిగా దివ్య నగేష్ ను చూసిన తెలుగు ప్రేక్షకులు ఇతర హీరోల సరసన హీరోయిన్‌ గా ఒప్పుకోవడం లేదు.

పైగా కాస్త బొద్దుగా ఉండటం కూడా ఆమెకు ప్రతికూల అంశంగా మారింది. దివ్య నగేష్ అరుంధతిలో నటించే సమయంకు ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దివ్య నగేష్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. మూడు పదుల వయసు ఇప్పటికే దాటిన దివ్య నగేష్ మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలు చాలా తక్కువ. హీరోయిన్ గా కాకున్నా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఏమైనా ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker