ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చెయ్యనని తెగేసి చెప్పిన సాయి పల్లవి.
సాయి పల్లవి.. తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయింది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. తెలుగులో సాయి పల్లవికి సపరేట్ క్రేజ్ ఉంది. ఆమెను టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఫిదా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.
అయితే ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది… ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. కాగా, ప్రస్తుతం సాయి పల్లవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. సాయి పల్లవి ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్ని కూడా మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.
కొన్ని సినిమాలు భారీ కలెక్షన్స్ ను కూడా అందుకున్నాయి.. సాయి పల్లవి పద్దతిగా కనిపిస్తూ స్కిన్ షోకు నో చెప్తూ దూసుకుపోతుంది. అయితే సాయి పల్లవిని సంబందించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. సాయి పల్లవి ఇప్పటివరకు ఎటువంటి యాడ్స్ లలో కనిపించలేదు.. అయితే ఓ యాడ్ కోసం ఈ అమ్మడికి ఏకంగా 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందిస్తామని ఆఫర్ చేశారట.. దానికి సాయి పల్లవి నో చెప్పిందని టాక్.
స్కిన్ ఫెయిర్నె స్ కు సంబందించిన యాడ్ అట.. అలాంటివాటికి ఎప్పుడు దూరంగా ఉండే ఈ బ్యూటీ ఎన్ని కోట్లు ఇచ్చిన చెయ్యనని చెప్పేసింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. అలాగే హిందీ రామాయణంలో నటిస్తోందనే రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. సీతగా సాయి పల్లవి కనిపించబోతుంది.