పెళ్లి వద్దు.. కానీ అది కావాలి అంటూ..! అసలు విషయం బయటపెట్టిన ఫరియా.
‘జాతి రత్నాలు’ హిట్‌తో హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని అందుకున్న ఫరియా అబ్దుల్లాకు టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు భారీగా వస్తాయని అనుకున్నారు. కానీ, ఆమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు మాత్రం దక్కలేదు. దీని తర్వాత ఆమె ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంతో చిన్న పాత్రలో మెరిసింది.
ఆ తర్వాత ‘బంగార్రాజు’ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసి అలరించింది. అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది.. ఈ సందర్బంగా ఎన్నో విషయాలను అందరికీ చెప్పింది.. అలాగే తనకు పెళ్లిపై హోప్ లేదు కానీ.. పిల్లలు మాత్రం కావాలంటూ చెప్పుకొచ్చింది. ఇటీవల ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ..
‘నా మ్యారేజ్ పైన నాకు హోప్ కూడా లేదు. ఒకవేళ అయితే అవ్వోచ్చు. కానీ కచ్చితంగా నేను పెళ్లి చేసుకోవాలి అని అయితే నాకు లేదు. కానీ నాకు పిల్లలు అంటే మాత్రం చాలా ఇష్టం.. అయితే అమ్మ అవుతాను.. పెళ్లి గురించి ఆలోచించాలి అని చెప్పుకొచ్చింది.
అయితే తండ్రి బాధ్యతలు కూడా ఉండాలి. ఒక చైల్డ్‌ని తల్లీతండ్రి ఇద్దరు కలిసే పెంచాలి. దాంట్లో నాకు డౌట్ లేదు.. కానీ పెళ్లి అనేది ఆలోచించాలి అని చెప్పింది.. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.