News

16 ఏళ్లకే హీరోయిన్, పెళ్లి చేసుకొని నటనకు దూరం. కట్ చేస్తే రూ. 1300 కోట్లకు అధిపతి.

దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి అని సామెత చెప్పినట్టు.. మూవీ కెరీర్ ఉండగానే గట్టిగా సంపాదించి పెట్టుకోవాలి.. అది పేరు అయినా.. డబ్బు అయినా.. ఈ విషయంలోకొంత మంది హీరోయిన్లు పార్ములాను కరెక్ట్ గా ఫాలో అయ్యారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఆ కోవలోకే వస్తారు. ఆమె ఎవరో కాదు కేరళ బ్యూటీ ఆసిన్. చాలా చిన్న వయసులో ఆసిన్(Asin) హీరోయిన్ గా మారింది. కేరళలోని కొచ్చి లో ఆసిన్ జన్మించారు.

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది ఆసిన్. 2001లో విడుదలైన నరేంద్ర మగన్ జయకాంతన్ వగా మకన్ సినిమాలో మొదటిసారి నటించింది. ఇప్పుడు ఆసిన్ వయసు 15 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ‘ సినిమాలో నటించింది. ఈ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కట్టాయి.

నాగార్జున, వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఆమె పలు హిట్ సినిమాల్లో అద్భుతమైన నటనతో మెప్పించింది. అటు తమిళంలో విజయ్, అజిత్, సూర్య, కమల్ హాసన్, విక్రమ్ సరసన సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాదు బాలీవుడ్ లో కూడా బడా హీరోలతో జత కట్టింది. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ వంటి నటులతో కలిసి నటించింది. బాగా సంపాదించింది.

కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఆసిన్ ఓ వ్యాపారవేత్త ను వివాహం ఆడింది. సల్మాన్ ఖాన్ స్నేహితుడు, మైక్రోమ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మతో ప్రేమలో పడింది. 2016లో అతడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది ఆసిన్. ఆమెకు ఆరిన అనే ఆరేళ్ల కూతురు ఉంది. ప్రస్తుతం ఆసిన్ ఆస్తి విలువ రూ. 1300 కోట్లకు పైమాటే అని సమాచారం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker