Health

ఆవలింతలు అతిగా వస్తున్నాయా..? అది కూడా గుండెపోటు సంకేతమే..!

ఆవలింత అనేది ఒక సాధారణమైన శారీరక క్రియ అని అనిపిస్తుంది కానీ, ఇది ఎప్పుడు, ఎందుకు వస్తుందోనని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతీ వ్యక్తి తన జీవితంలో చాలా సార్లు ఆవలిస్తూ ఉంటాడు, సాధారణంగా ఎవరైనా ఆవలిస్తే అది నిద్రకు సంకేతంగా భావిస్తారు. అయితే శరీరం అలసట లేదా విసుగు చెందినప్పుడు ఆవలింత రావడం సర్వసాధారణమైన లక్షణం.

ఈ ఆవలింత అనేది తాత్కాలికంగా హృదయ స్పందన రేటు, శరీర చురుకుదనాన్ని పెంచే కొన్ని హార్మోన్ల కారణంగా వస్తుందని మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా తన అధ్యాయనాల ద్వారా పేర్కొంది. అయితే ఓ వ్యక్తి 15 నిముషాల వ్యవధిలోనే 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఆవలిస్తే అతనిలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాట్లని కూడా సదరు యూనివర్సిటీ పేర్కొంది.

విపరీతమైన ఆవలింత కొన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల కూడా సంభవిస్తుందని తెలిపింది. నిద్రలేమి.. శరీరానికి సరిపడినంతగా నిద్ర లేకపోతే ఆవలింతలు వస్తుంటాయి. రానున్న కాలంలో ఇది మానసిక సమస్యగా, ఒత్తిడి ఆందోళనకు దారితీస్తుంది. మెడిసిన్స్.. మెడిసిన్స్‌ని అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఆవలింతలు వస్తుంటాయి.

మెడిసిన్స్ కారణంగా కలిగే మగతు భావన శ్వాస పదేపదే ఆగిపోయేలా చేస్తుంది. మెడిసిన్స్ పరిమితిని తగ్గించకుంటే శరీరంపై సైడ్ ఎఫ్పెక్ట్స్ చూపిస్తాయి. మెదడు సమస్యలు.. ఆవలింతలకు కూడా మెదడు సమస్యలు కూడా కారణం కావచ్చు. పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్, మైగ్రేన్ వంటి సమస్యల కారణంగా ఆవలింతలు వస్తాయి.

ఆందోళన లేదా ఒత్తిడి.. ఆవలింత కూడా ఆందోళన, ఒత్తిడికి ఒక లక్షణమే. ఈ సమస్యల నుంచి బయటపడకుంటే రానున్న కాలంలో కేశ, చర్మ సమస్యలు కలిగే ప్రమాదం ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker