అయోధ్య రామమందిరానికి వెళ్లాలనుకుంటున్నారా..? మీకోసమే ఈ పూర్తి వివరాలు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు రామ మందిరం చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవం జరిగిన కొన్ని రోజుల తర్వాత నగరంలో రామ్ లల్లా దర్శనం కోసం దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దాంతో పొడవైన క్యూలు బారులు తీరుతున్నారు. బాలరాముని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు భారీ క్యూలలో వేచి ఉంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ఆలయ ట్రస్ట్ ఆరతి, దర్శనానికి సంబంధించిన కొత్తగా అప్‌డేట్ చేసిన షెడ్యూల్‌లను విడుదల చేసింది.
భక్తులకు పూజలు చేసే అవకాశం కల్పించేందుకు ఆలయ ట్రస్ట్ దర్శన వేళల్లో కూడా మార్పులు చేసింది. ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) హారతి, దర్శనం కోసం విడుదల చేసిన షెడ్యూల్ వివరాలను ఓసారి పరిశీలిద్దాం. ఆలయ దర్శన సమయం ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు దర్శననానికి అనుమతిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుంది. రామ్ లల్లా విగ్రహానికి శృంగార్ ఆరతి (ప్రార్థన) ఉదయం 6:30 గంటలకు మొదలవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు భోగీ ఆరతి ఉంటుంది.
రాత్రి 7.30 గంటల నుంచి సంధ్య ఆరతి కోసం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రామమందిర దర్శనానికి వచ్చే భక్తులకు సాధారణ ప్రవేశానికి ఎలాంటి ఫీజు లేదు. ఉచిత ప్రవేశానికి అనుమతి ఉంటుంది. ఆలయ ప్రవేశానికి ముందుగా ఆన్‌లైన్ ద్వారా పాస్ తీసుకోవాలి. అందులో ప్రత్యేకించి ఆరతి దర్శనం కోసం పాస్ తప్పనిసరిగా ఉండాలి. ఆరతి దర్శనానికి తప్పనిసరిగా పాస్ ఉండాలి. కానీ, ఆరతి దర్శనం ఉచితంగా భక్తులకు అనుమతి ఉంటుంది. ఆరతి లేదా బాలరాముని దర్శనానికి టికెట్లను ఆలయ వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.
https://online.srjbtkshetra.org వెబ్ సైట్ ద్వారా దర్శన టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. ఆలయ దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ అందుబాటులో లేదు. ప్రస్తుతానికి బుకింగ్ హోల్డ్ చేసి ఉంచడం జరిగింది. సాధారణంగా ఆలయ దర్శనం కోసం భక్తులకు అందించే పాస్‌లపై QR కోడ్స్ ద్వారా ప్రవేశించేందుకు అనుమతి ఉంటుంది. అయోధ్య చేరుకునే భక్తులు రోడ్డు, రైలు, వాయు (విమాన) మార్గాల్లో చేరుకోవచ్చు. అయోధ్యలో బాలరాముని దర్శన కోసం కనీసం ఒకటి నుంచి రెండు రోజుల వరకు బస చేయాల్సి ఉంటుంది.