ఏంటీ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి పెళ్లయిందా..! భార్య ఎవరో తెలుసా..?
హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావడం తో ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సహితం ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ ఒక్క సినిమాతోనే ఇంత గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ కి వివాహం అయ్యిందా? లేదా? అనే విషయం పై అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కి వివాహమయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని ఎంతోమంది చెప్పినప్పటికీ లేడీ ఫ్యాన్స్ మాత్రం నమ్మట్లేదు. అయితే కానీ ప్రశాంత్ కి పెళ్లి అయిందని ఇప్పుడు తెలియడంతో పాపం అతని లేడీ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఇటీవల హనుమాన్ సినిమా భారీ విజయం సాధించినందుకు థ్యాంక్యూ మీట్ పెట్టారు. ఈ ఈవెంట్ కి ప్రశాంత్ భార్య సుకన్య కూడా వచ్చింది.
ఈ ఈవెంట్లో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ తనకు సపోర్ట్ గా నిలిచినందుకు, సినిమా కోసమే ఎక్కువ టైం ఇచ్చి తనతో ఎక్కువ సేపు గడపకపోయినా అర్ధం చేసుకున్నందుకు భార్యకు థ్యాంక్స్ చెప్పాడు. తేజ సజ్జ కూడా ప్రశాంత్ వర్మ భార్య సుకన్యకు థ్యాంక్స్ చెప్పాడు. దీంతో సుకన్య ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్లో ప్రశాంత్ వెనకే అతని భార్య సుకన్య కూర్చుంది.
ఇక తేజ సజ్జ మాట్లాడుతుంటే వీడియోల్లో కూడా సుకన్య కనపడింది. దీంతో సుకన్యని చూసిన వాళ్ళు ప్రశాంత్ వర్మకి ఇంత అందమైన భార్య ఉందా? జోడి భలేగుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ లేడీ ఫ్యాన్స్ ఈ విషయం తెలిసి అతనికి పెళ్లి అయిపోయిందా అని బాధపడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో సరదాగా మీమ్స్ కూడా చేస్తున్నారు.