News

అయోధ్య తీర్పు వెనక ఉన్న ఈ వ్యక్తి గురించి తెలిస్తే రెండు చేతులెత్తి దండం పెడతారు.

రామభద్రాచార్య తులసీదాసు పేరు మీద చిత్రకూట్ లో ఉన్న మత, సామాజిక సేవా సంస్థ తులసి పీఠ్ స్థాపకుడు, అధిపతి. చిత్రకూట్‌లోని జగద్గురు రామభద్రాచార్య వికలాంగుల విశ్వవిద్యాలయ స్థాపకుడు, జీవితకాల ఛాన్సలర్. అయితే అయోధ్య వివాదంలో.. రాముడిని గెలిపించిన వ్యక్తి పేరు రామభద్రాచార్యస్వామి.. ఈయన వల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షం గా వచ్చింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ స్వామీజీ అంధుడు. కానీ ఆ లోపం ఆయన ఎదుగుదలను ఆపలేదు.

ఈ క్రమంలో అయోధ్య విచారణ సందర్భంగా రామభద్రాచార్య స్వామి ఋగ్వేదంలో శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రాలు, వాటికి భాష్యాలను కోర్టులో చెప్పారు. అంధుడై ఉండి వేదాలు చెప్పడంతో అక్కడి వారు ఆశ్చర్యపోయారు. వేద శక్తి మహిమ, సనాతనధర్మం గొప్పతనం గురించి తెలుసుకుని అవాక్కయ్యారు. ఋగ్వేద మంత్రాలకు పదవాక్య ప్రమాణజ్ఞుడయిన శ్రీ నీలకంఠ పండితుడు ఏనాడో రాసిన భాష్యం.. మంత్ర రామాయణం. దీనిలో 157 ఋగ్వేద మంత్రాలకు భాష్యం ఉంది. దీనిలో దశరథుని పుత్ర కామేష్టి నుండి సీతా మాతా భూమిలోకి ప్రవేశించే ఘట్టం వరకు ఉంది. వీటన్నింటిని రామభద్రాచార్య స్వామి కోర్టు వాదనల సందర్భంగా విన్నవించారు.

రామజన్మభూమి వివాదం గురించి కోర్టులో వాదాలు జరుగుతున్నప్పుడు జడ్జీలలో ఒకరు.. హిందువులు అన్నింటికి వేదం ప్రమాణమంటారు కదా.. మరి ఆ వేదాలలో రాముడి గురించి ఎక్కడ ఉందో చెప్పమని ప్రశ్నించారట. అప్పుడే అయోధ్య ఆలయం తరఫున వాదనలు వినిపిప్తున్న లాయర్‌.. రామభద్రాచార్య స్వామిని కోర్టుకు తీసుకువచ్చి సాక్ష్యం ఇప్పించారు. అంధుడైనప్పటికి.. ఆయన అనర్గళంగా ఆయన ఋగ్వేదమంత్రాలు చదువుతూ దాని భాష్యం చెబుతూ రామకథని వివరిస్తూంటే జడ్జీలతో సహా కోర్టంతా దిగ్భ్రాంతికి లోనయ్యింది.

అంధుడు పుస్తకం, మనిషి అవసరం లేకుండా అతి ప్రాచీనమైన రుగ్వేద మంత్రాలు, దాని భాష్యం చెప్పడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అలా రాముడిని గెలిపించడంలో రామభద్రాచారా స్వామి కీలక పాత్ర పోషించారు. నేడు మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంఉటన్నారు. రామభద్రాచార్య స్వామి విషయానికి వస్తే.. ఆయన ఒక మఠానికీ అధిపతి కూడా. ఏది ఏమైనా కోట్లాది మంది హిందువుల కల నెరవేర్చడంలో ఆయన కృషి మరపురానిది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker