ఈ చిట్కాతో ఎలాంటి ఖర్చు లేకుండా రెండు రోజుల్లో వీపుపై కురుపులు, దద్దుర్ల సమస్యలు తగ్గిపోతుంది.

గాలిలో తేమ పెరగడం వల్ల శరీరం దురద వస్తుంది. సాధారణంగా మెడ, ముఖం, చేతులు, అరికాళ్లు మరియు చేతులు, ప్రైవేట్ భాగాలలో దురద సమస్య పెరుగుతుంది. కొన్నిసార్లు సింథటిక్ బట్టలు, వేడి, అధిక తేమ దురదకు కారణమవుతాయి. శరీరంపై ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి. వాతావరణ మార్పు దురద సమస్యను పెంచుతుంది. దీనిని నివారించడానికి, కొన్ని ఇంటి నివారణలను ఉపయోగించడం వల్ల సమస్యను నివారించవచ్చు. అయితే ప్రస్తుతం చాలా మందిలో ముఖంపై మొటిమలే కాకుండా వీపుపై కూడా వస్తున్నాయి.
అంతేకాకుండా వీపుపై అతిగా కురుపులు వస్తున్నాయి. అయితే వీటి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన చాలా రకాల ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మహిళ ఇలాంటి సమస్యలతో బాధపడేవారు బ్యాక్‌లెస్ డ్రెస్‌లు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.
ఈ చిట్కాలతో చెక్ పెట్టొచ్చు.. అలోవెరా జెల్.. అలోవెరా జెల్ చర్మానికి చాలా రకాల ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే గుణాలు మొటిమల సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా వేడి కారణంగా వీపుపై దద్దుర్లు, మొటిమలతో బాధపడుతున్నవారు ప్రభావిత ప్రాంతంలో అలోవెరా జెల్‌ని అప్లై చేసి 40 నిమిషాల పాటు అలాగే ఉంచి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
తేనె, దాల్చిన చెక్క పొడి.. తేనె, దాల్చిన చెక్క పొడిని రెండింటిని కలిపి ఫేస్ ప్యాక్‌లా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని కురుపులు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి వాటిని తొలగించాల్సి ఉంటుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనిని వినియోగించడం వల్ల స్కిన్ సమస్యలు సులభంగా దూరమవుతాయి.
గ్రీన్ టీ.. ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గడానికి గ్రీన్ టీలను తాగుతూ ఉంటారు. అయితే ఇది చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. గ్రీన్ టీని నీటిలో ఉడికించి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి, ఆరిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి.