బెల్లం, పుట్నాల లడ్డులు రోజుకు ఒకటి తింటే నిజంగానే ఆ నొప్పులు తగ్గిపోతాయ్.

బెల్లం ప్రతి రోజు తినడం వల్ల రక్తహీనత సమస్య పోతుంది. ఇక మలబద్ధకం దరిచేరదు. రోజు భోజనం చేసిన తరువాత ఒక చిన్నబెల్లం ముక్క తింటే త్వరగా జీర్ణమవుతుంది. బెల్లం వల్ల ఎన్నో లాభాలున్నాయి. కానీ బెల్లం, పుట్నాలు కలిపి తినే అలవాటుంటుంది. చిన్నప్పుడు సరుకులు తీసుకున్నప్పుడు షాపు వాళ్లు ఫ్రీగా ఇచ్చే వాళ్లు ఇప్పుడు అన్నీ మాల్స్ వచ్చిన తరువాత అస్సలు ఎవ్వరూ ఇవ్వడం లేదు. అయితే చాలామందిలో చిన్న వయసులోనే మోకాళ్ళ సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా నడిచేటప్పుడు..కూర్చునేటప్పుడు మోకాల్లో వింత శబ్దాలు వస్తున్నాయి.
అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం శరీరంలో క్యాల్షియం లోపించడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా ఎముకలు బలహీనంగా మారి.. మోకాళ్ళ బొక్కలు అరిగిపోతున్నాయిం. దీంతో నడిచే క్రమంలో తీవ్ర నొప్పులకు గురవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలను తప్పకుండా పాటించాలి. వీటిని పాటించడం వల్ల వీలైనంత తొందర్లోనే ఉపశమనం లభిస్తుంది.
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు పాలలో బెల్లం, పుట్నాలు కలుపుకొని తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరంలోని క్యాల్షియం లోపం తగ్గుతుంది. ఇలా ప్రతిరోజు రెండు పూటలు పాలను తాగడం వల్ల శరీరంలోని మలినాలు కూడా బయటికి వస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు తగ్గి.. మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పాలను పెద్ద వారే కాకుండా పిల్లలు తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు.
పుట్నాలు, బెల్లం కలిపిన గోరువెచ్చని పాలను ప్రతిరోజు తాగడం వల్ల ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. ముఖ్యంగా మోకాలు నుంచి శబ్దాలు రావడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఈ పాలను ఉదయం ఖాళీ కడుపుతో, రాత్రి భోజనం తర్వాత తాగితే మోకాళ్ళ సమస్యలు అనేటివి ఉండవట. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తరచుగా రక్తపోటు సమస్యలతో బాధపడే వారు కూడా ఈ పాలను తాగవచ్చు. మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు పుట్నాలను నీటిలో నానబెట్టి పాలలో ఉడికించి చక్కెరకు బదులుగా బెల్లాన్ని వేసుకొని తాగడం వల్ల ఈ నొప్పులకు ప్రభావంతంగా సహాయపడుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణాలను కూడా తగ్గించేందుకు ప్రభావంతంగా దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.