పరగడుపున ఉసిరి చూర్ణం కొంచం తిన్నా చాలు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.

డయాబెటిస్‌తో బాధపడేవారికి ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో అవసరమైన విటమిన్ “సి” అధికంగా ఉంటుంది అలాగే ఉసిరికాయ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పెంచుతుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉదయాన్నే ఒక మంచి ఉసిరి కాయ తినడం వలన షుగర్ నియంత్రణలో ఉంటుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఎండినవి కూడా వాటిలో అందుబాటులో ఉన్నాయి.
పచ్చివి కంటే ఎండిన ఉసిరి అనేక రకాల వ్యాధులకు ఔషధంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులను సులభంగా నియంత్రిస్తాయి. తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడేవారు ప్రతిరోజు వీటి చూర్ణాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉసిరి చూర్ణంలో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది.
కాబట్టి వానాకాలంలో ఈ చూర్ణాన్ని పాలలో కలుపుకొని తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుంచి కూడా విముక్తి కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉసిరి పొడిని క్రమంగా తీసుకునే వారిలో రోగనిరోధక శక్తి కూడా పెరిగిందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆధునిక జీవనశైలి అనుసరించే చాలామందిలో జీర్ణక్రియ సమస్యలు వస్తున్నాయి.
దీని కారణంగా అధిక శరీర బరువు పెరుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఎండిన ఉసిరి ముక్కలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల తొందర్లోనే ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే ఆయుర్వేద లక్షణాలు పొట్టలో గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను కూడా సులభంగా తగ్గిస్తాయి. ప్రస్తుతం చాలామంది దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం గుండెపోటు బారిన పడుతున్నారు.
అయితే ఇలాంటి వ్యాధులతో సతమతమవుతున్న వారు తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎండిన ఉసిరితో తయారుచేసిన చూర్ణాన్ని ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల వాటి ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యలను కూడా ప్రభావంతంగా తగ్గిస్తాయి.