Health

మీకు ఎక్కువగా పీడకలలు వస్తున్నాయా..? అవి దేనికీ సంకేతమో తెలుసా..!

ఎవరో తరుముతున్నట్టు, పాము వెంటపడుతున్నట్టు, దయ్యాలు కనిపించినట్టు, ఎవరో తమను చంపడానికి వస్తున్నట్లు.. ఇలా భయపెట్టే కలలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఆ భయంతో రాత్రంతా నిద్రపోకుండా ఆందోళన చెందుతుంటాం. కొందరిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. కానీ దీన్ని సీరియస్‌గా తీసుకునేవారు చాలా తక్కువ. అవే వచ్చి పోతాయిలే అనుకుంటారు. కానీ ఇలాంటి పీడకలలు భవిష్యత్తులో రాబోయే మతిమరుపుకు సూచనలు అంటున్నారు. అయితే రాత్రి పూట రోజూ పీడకలలు రావడం అనేది సాధారణ విషయం కాదు.

అది అంతర్లీన ఆరోగ్య సమస్యలకు చిహ్నం కూడా కావచ్చు. ముఖ్యంగా ఎవరికైతే పీడకలలు అధికంగా వస్తాయో వారు వయసు ముదురుతున్న కొద్దీ వారు మతిమరుపు బారిన త్వరగా పడతారు. అంతే కాదు చిన్న వయసులోనే చాలా విషయాలు మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి పీడకలలు వస్తున్న వారు, మతిమరుపు సమస్యలు ఉన్నాయేమో ఓసారి చెక్ చేసుకోండి. విషయాలు మర్చిపోవడాన్ని డిమెన్షియా అంటారు. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్ హామ్ పరిశోధకులు పీడకలల వల్ల కలిగే అనర్ధాలు గురించి అధ్యయనం చేశారు.

పీడకలల వల్ల విషయ గ్రహణ సామర్థ్యం తగ్గిపోతుందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో భాగంగా ముప్పై అయిదేళ్ల నుంచి అరవై నాలుగేళ్ల వయసు మధ్య వారిని ఎంచుకున్నారు. దాదాపు 2,600 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. సాధారణ మనుషులతో పోలిస్తే పీడకలలు వచ్చే వారు త్వరగా మతిమరుపు బారిన పడతారు. సాధారణ మనుషులతో పోలిస్తే పీడకలలు వచ్చే వారు డిమెన్షియ బారిన పడే అవకాశం నాలుగు రెట్లు అధికమని అంటున్నారు అధ్యయనకర్తలు. పీడకలలు వచ్చేవారు ఆ విషయాన్ని తేలికగా తీసుకోకూడదు.

వెంటనే మానసిక వైద్యులను సంప్రదించాల్సి అవసరం ఉంది. కలలు అందరికీ వస్తాయి, కానీ పీడకలలు మాత్రం అందరికీ రావు. సాధారణ కలల వల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ పీడకలలు వల్ల మాత్రం చాలా ప్రమాదం. కొన్ని రకాల నిద్రా రుగ్మతల వల్ల కూడా పీడకలలు వచ్చే అవకాశం ఉంది. స్లీప్ ఆప్నియా, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్, నార్కోలెప్సీ వంటి నిద్రా సమస్యలు వల్ల పీడకలలు అధికంగా రావచ్చు. స్లీప్ అప్నియా వంటి సమస్యలు వచ్చినప్పుడు నిద్రలో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.

అప్పుడు పీడకలలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. అయితే పీడకలలకు, డిమెన్షియా మధ్య సంబంధాన్ని తేల్చడానికి మరింత లోతైన అధ్యయనాలు అవసరం పడతాయి. ఈ పీడకలలు ఆడవారి కన్నా మగవారిలోనే వచ్చే అవకాశం ఉంది. వీరికే డిమెన్షియా వచ్చే అవకాశం పెరుగుతుంది. యాంటీ డిప్రెసెంట్లు వాడే వారిలో కూడా పీడకలలు వచ్చే ప్రమాదం అధికంగానే ఉంటుంది. ట్రామా, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి జబ్బుల బారిన పడినా కూడా పీడకలలు అధికంగా వస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker