Health

వారాలు గడుస్తున్నా జలుబు తగ్గడం లేదా..? అయితే మీరు వెంటనే దగ్గరలో ఉన్నా..!

సాధారణ జలుబు మీకు పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. కానీ, అది వ్యక్తిని అలసిపోయేలా చేస్తుంది. శక్తిని క్షీణింపజేస్తుంది. దీనికి తుమ్ము, దగ్గు వంటివి తోడైతే.. ఇక సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. అనేక సందర్భాల్లో ఈ జలుబు కారణంగా చెవిపోటు సమస్య కూడా వస్తుంది. కొన్నిసార్లు ఆస్తమా లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. దీర్ఘకాలిక జలుబు తీవ్రమైన సైనసైటిస్‌కు కారణమవుతుంది. ఇది సైనస్‌లలో వాపు కి దారితీస్తుంది. అయితే కోవిడ్ వచ్చి తగ్గాక కొన్ని రకాల సమస్యలు ఇంకా బాధిస్తూనే ఉన్నాయి.

కరోనా వచ్చి తగ్గిన వారిలో జలుబు తరచూ వచ్చి ఇబ్బంది పెడుతోంది. కొందరిలో వారాలు గడుస్తున్నా కూడా జలుబు తగ్గడం లేదు. దీన్నే లాంగ్ కోల్డ్ సమస్యగా గుర్తించారు వైద్యులు. ఇలా లాంగ్ కోల్డ్ సమస్యతో బాధపడే వారిలో కడుపునొప్పి, దగ్గు, అతిసారం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. శ్వాసకోశ వైరస్ లేదా ఇతర ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వలనైన శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చి ఇలా జలుబు ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. సాధారణంగా జలుబు వారం రోజుల్లో తగ్గిపోతుంది.

అలాకాకుండా నెల రోజులపాటు కొనసాగిందంటే మీకు లాంగ్ కోల్డ్ సమస్య ఉన్నట్.టు లేదా రోగ నిరోధక శక్తి చాలా బలహీనంగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు కోవిడ్ బారిన పడిన వారిలో వందల మంది ఇప్పుడు లాంగ్ కోల్డ్ బారిన పడినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వీరంతా కూడా కడుపునొప్పి, డయేరియా, కీళ్ల నొప్పులు, నిద్రలేమి, ఏకాగ్రత లేకపోవడం, తల తిరగడం, కళ్ళు తిరగడం, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు.

ఇలాంటి లక్షణాలతో పాటు జలుబు కూడా ఉంటే మీకు లాంగ్ కోల్డ్ సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. లాంగ్ కోల్డ్ సమస్యతో బాధపడేవారు ముందుగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నాయేమో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. కేవలం కోవిడ్ బారిన పడిన వారిలోనే కాదు ఇతర శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వారిలో కూడా ఇలా దీర్ఘకాలికంగా జలుబు వేధిస్తుంది. కాబట్టి దీర్ఘకాలంగా జలుబు ఉండడానికి కారణం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

లాంగ్ కోల్డ్ తో పోరాడటానికి ఎక్కువగా వేడిగా ఉన్న ఆహారాలను తినాలి. నీళ్లు కూడా చల్లటివి తీసుకోకూడదు. చల్లటి నీళ్లు తలస్నానం చేయకూడదు వేడివేడిగా ఉన్నప్పుడే ఆహారాన్ని తినాలి. చికెన్ సూప్, చేపలు, గుడ్లు, పాలు బీన్స్ వంటివి అధికంగా తినాలి. ఇవన్నీ కూడా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహకరిస్తాయి. కివి పండ్లను కూడా అధికంగా తింటే మంచిది. దానిమ్మ, ఆపిల్ అధికంగా తింటే త్వరగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి నిండుగా ఉండే పదార్థాలను తింటే రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker