Health

మీకు నిద్రలో ఇలాంటి కలలు వస్తూ ఉంటే వాటి అర్థం తెలిస్తే వణికిపోతారు.

ఏదైనా విషయం గురించి పదేపదే ఆలోచిస్తే దానికి సంబంధించిన స్వప్నం వస్తుంది. అలాంటి వాటిని ‘చింతజములు’ అంటారు. జ్వరం, ఇతర రుగ్మతలకు గురైనప్పుడు మానసికంగా ఆందోళన కారణంగా కొన్ని కలలు వస్తుంటాయి. ఇవి ‘వ్యాధిజములు’. ఈ రెండు రకాల స్వప్నాలు భవిష్యత్తుకు సూచికలు కావు. అయితే ప్రతి కలకి ఒక అర్థం ఉంటుందని మీకు తెలుసా..? మీ జీవితంలో చాలా విషయాలు కలలకు సంబంధించినవే ఉంటాయి. కలల్లో మీరు చాలా చూస్తారు. కానీ ఆ కలలకు అర్థాలు తెలియకపోవడం వల్ల వాటిని విశ్లేషించలేకపోవచ్చు. ఇవాళ మనం కొన్ని రకాల కలులు.

చెప్పుల దొంగతనం:- కలలో మీ బూట్లు ఎవరో దొంగిలించినట్లు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ కల అనారోగ్యానికి సంకేతమని డ్రీమ్ సైన్స్ చెబుతోంది. ఈ కల వచ్చినట్లయితే, మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించండి. మంచి ఆహారం తీసుకోండి. కుక్క కరిచినట్లు కల:- మీ కలలో మిమ్మల్ని కుక్క కరిచినట్లయితే, అది అశుభకరమైన కల అని అర్థం. ఒక కుక్క మిమ్మల్ని కరిచినప్పుడు మీరు రక్తం చూస్తే, మీరు మీ శత్రువుల నుంచి బాధపడతారని అర్థం. విశ్వాసపాత్రమైన కుక్క కరవడం అనేది ప్రమాదకర సంకేతం. అందువల్ల మీరు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

చీపురు:- కలలో చీపురు చూడటం చాలా అశుభం. డ్రీమ్ సైన్స్ ప్రకారం, మీరు కొన్ని చెడు వార్తలను అందుకోబోతున్నారని అర్థం. చీపురు అనేది ఇళ్లలో దరిద్రాన్ని తరిమేస్తుంది. నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపుతుంది. అలాంటి చీపురు మీకు కనిపించిందంటే.. ఏదో దరిద్రం మీకు పట్టబోతోందని అర్థం. గులాబీ పువ్వును చూడటం:- ఎవరైనా కలలో గులాబీ పువ్వును చూసినట్లయితే లేదా మీరు గులాబీ పువ్వును తినడం చూస్తే, మీరు భవిష్యత్తులో తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారని అర్థం. ఎందుకంటే గులాబీ పువ్వుకి కింద ముళ్లు ఉంటాయి. అందువల్ల ఈ పువ్వును తినడం అనేది నెగెటివ్ సంకేతం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

గింజలు:- మీ కలలో గింజలు కలిపిన బురద కనిపిస్తే జీవితంలో సంక్షోభం వస్తుందని తెలుసుకోండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనకు ముఖ్యమైనది ఆహారం. అది లేకపోతే మనం బతకలేం. అలాంటి ఆహారానికి మూలం గింజలు. అవి బురదపాలైతే.. మనకు కరవు వస్తున్నట్లే. ముళ్ల చెట్టు:- ముళ్ల చెట్టుపై నిద్రిస్తున్నట్లు కలలు కన్న వ్యక్తి అనేక కుటుంబ సమస్యలను ఎదుర్కొంటాడు. ఎందుకంటే ముళ్ల చెట్టు అనేది నెగెటివ్ సంకేతం. అలాంటి చెట్టుమీద నిద్రపోదామన్నా రాదు.

అలాగే జీవితంలో కూడా సమస్యల్ని తప్పించుకుందామన్నా కుదరదు. అవి వెంటాడతాయి. నవ్వడం:- మీరు కలలో చాలా నవ్వినట్లు కనిపిస్తే, మీరు గొప్ప విచారాన్ని ఎదుర్కొంటారని అర్థం. నిజానికి నవ్వు అనేది మంచిదే. కానీ ఇక్కడ అతిగా నవ్వడం అనేది చెడు సంకేతం. ఇందులో వెకిలి నవ్వు కూడా ఉండొచ్చు. వెటకారపు నవ్వు ఉండొచ్చు. ఇది ప్రమాదకరమైన నవ్వు. దీని వల్ల సమస్యలు రావొచ్చని డ్రైమ్ సైన్స్ చెబుతోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker