News

తిరుమల వెళ్లే వారికి శుభవార్త, దర్శనం కోసం క్యూ లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు.

తిరుమల వెంకన్న భక్తులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు ఆలోచన చేస్తోంది. తిరుమల వీఐపీ బ్రేక్‌ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఇకపై ఆన్‌లైన్‌లోనే కోనుగోలు చేసేలా టీటీడీ చర్యలు తీసుకుంది. అయితే శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త అందించింది తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ). తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను ఇకపై భక్తులు ఆన్ లైన్ లో కొనుగోలు చేసే అవకాశం టీటీడీ కల్పించనుంది.

ఇప్పటికే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది. ఎంబీసీ 34 లోని కౌంటర్ వద్ద టికెట్ల కోసం భక్తులు చాలా వరకు క్యూ లైన్ లో నిరీక్షించాల్సిన పరిస్తితి ఉంటుంది. ఈ ఇబ్బందులు తొలగించడానికి టీటీడీ నూతన విధానం అమలు చేసేందుకు సిద్దమైంది. సాధారణంగా వీఐపీలు ఎక్కువగా సిఫార్సులపైనే వెళ్తుంటారు. అలాంటి సిఫార్సు లేఖలు అందజేసిన భక్తులకు మొబైల్ కి ఓ లింక్ తో కూడిన మెసేజ్ వెళ్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేస్తే.. పేమెంట్ ఆప్షన్ వస్తుంది.

ఆ పేమెంట్ చెల్లిస్తే.. ఆన్ లైన్ లో టికెట్ డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. గతంలో పలు కౌంటర్ల వద్ద భారీగా క్యూ లైన్లో నిలబడి దర్శనం టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. టెక్నాలజీ వచ్చిన తర్వాత టీటీడీ ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఆన్ లైన్ లో టికెట్ డౌన్ లోడ్ విధానం టీటీడీ రెండు రోజుల నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది.

ఈ విధానంపై భక్తుల అభిప్రాయాలను కూడా సేకరిస్తుంది. ఈ నేపథ్యంలోనే తుది నిర్ణయాయిని టీటీడీ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలలో తిరుమల తిరుపతి వెళ్లాలనుకునే వారు ఈ ఆప్షన్ చెక్ చేసుకోవాలి. ఏది ఏమైనా స్వారి వారి దర్శనం టికెట్ ఈ విధంగా లభించడంపై భక్తులు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker