ఇలా మచ్చలున్న అరటిపండు తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి.

అరటి ఆకులు చాలా సున్నితంగా, పెద్దగా సౌలభ్యంగా ఉంటాయి. ఇవి తడి అంటకుండా ఉంటాయి, అందువల్ల వీటిని గొడుగుకు బదులుగా వాడతారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలోను, చైనా, జోంగ్జీ, మధ్య అమెరికాలలో వీటిని వంటకాలు చుట్టడానికి ఉపయోగిస్తారు. అయితే అరటిపండు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు అరటిపండ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కొంతమంది డజన్ లకు డజన్ లు అరటిపండ్లు లాగేస్తూ ఉంటారు.
అరటిపండు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడంతో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది. అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది. ఏడాది పొడవునా దొరికే ఫ్రూట్స్ లలో అరటి పండ్లు కూడా ఒకటి. ధర తక్కువ అయినప్పటికీ దీనివల్ల పోషకాలు ఎక్కువే. అయితే చాలామంది అరటిపండు కొంచెం మెత్తగా లేదంటే పూర్తిగా మాగిపోయింది అంటే చాలు వెంటనే వాటిని పారేస్తూ ఉంటారు. కానీపండిన అరటి పండు కూడా చాలా మంచిది అంటున్నారు నిపుణులు. కానీ మనలో చాలా మంది పండిన అరటి పండు తినడాన్ని ఇష్టపడరు.
పిల్లలైతే అస్సలు తినరు కానీ పండిన అరటి పండు చాలా మంచిదట. బాగా పండిన అరటిపండ్లు ఆకలి తగ్గించకపోయినా ఆరోగ్యానికి చాలా మంచివి. మరి పండిన అరటిపండు వల్ల కలిగే ప్రయోజనాల విషయానికొస్తే.. పండిన అరటిపండు సెల్స్ డ్యామేజీని నిరోధిస్తుంది. బాగా పండిన అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరంలోని కణాల నష్టాన్ని నివారించడంలో ఆలస్యం చేయడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. క్రమంగా ఇది వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఈ పండు సులభంగా జీర్ణమవుతుంది అరటి పండు పండినప్పుడు, వాటిలోని స్టార్చ్ కార్బోహైడ్రేట్లు ఉచిత చక్కెరలుగా మారుతాయి. తద్వారా ఈ అరటిపండ్లు సులభంగా జీర్ణమవుతాయి. అదే పచ్చి అరటిపండ్లలో అయితే జీర్ణించుకోలేని పిండిపదార్థాలు ఉంటాయి. పండిన అరటిపండు క్యాన్సర్‌తో పోరాడడంలో మీకు సహాయపడుతుంది. అరటిపండు బాగా పండినప్పుడు, దాని పై తొక్క ముదురు రంగులోకి మారుతుంది.
పై తొక్కపై ఉన్న నల్ల మచ్చలు ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ని సృష్టిస్తాయి. ఇది క్యాన్సర్ వంటి అసాధారణ కణాలను నాశనం చేస్తుంది.అలాగే ఇది మీకు గుండెల్లో వచ్చే మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది అధికంగా పండిన అరటిపండు యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. పండిన అరటిపండు హానికరమైన ఆమ్లాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అరటిపండులోని ఫైబర్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అరటిపండులో ఉండే ఐరన్, కాపర్ బ్లడ్ కౌంట్ ని పెంచుతుంది.