News

ఎన్నికల్లో ఘోరంగా ఓడిన బర్రెలక్క, ఎన్ని ఓట్లు వచ్చాయంటే..?

డిగ్రీ చేసిన బర్రెలక్క ఉద్యోగం రాకపోవడంతో బర్రెలను కాసుకుంటున్నానని మొదట ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో వైరలైంది. ఆ తర్వాత కూడా ఆమె చేసిన వీడియోలకు మంచి స్పందన రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్‌ గా మారిపోయింది బర్రెలక్క. అదే క్రేజ్ తో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. అనూహ్యంగా ఆమెకి ప్రజలనుండి, ముఖ్యంగా నిరుద్యోగ యువత నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

అయితే నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ ఫైట్‌ జరిగింది. మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లు రవి 94,414 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికలో బర్రెలక్క ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. నోటా కంటే ఆమెకు తక్కువ ఓట్లు రావడం గమనార్హం. నోటాకు 4, 580 ఓట్లు రాగా, బర్రెలక్కకు 3, 087 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ, బర్రెలక్కకు పోస్టల్‌ బ్యాలెట్‌లో 50 ఓవర్లు రావడం విశేషం. ప్రభుత్వ ఉద్యోగులు 50 మంది ఆమెకు మద్దతుగా నిలబడినట్లే లెక్క.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీలో ఉండి ప్రచారం చేసిన సమయంలో ఆమెపై దాడి కూడా జరిగింది. కానీ, ఆమె ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేసుకుంటూ.. ఒకసారి నిరుద్యోగ సమస్యను లెవనెత్తి బర్రెలక్కకు శిరీష వైరల్‌ అయిన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన ఫాలోయింగ్‌ను నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు ఎన్నికల బరిలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వెక్కిరించాన.. వెనకడుగు వేయకుండా లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేయడంపై బర్రెలక్కను చాలా మంది ప్రశంసించారు.

ఆమెకు వచ్చిన ఓట్లు తక్కువే కావొచ్చు కానీ, ఆమె ధైర్యాన్ని అంతా మెచుకోవాల్సిందే అంటూ సోషల్‌ మీడియాలో శిరీషకు మద్దతు లభిస్తుంది. ఒక సామాన్య యువతి ఇంత ధైర్యంగా ఎన్నికల బరిలో నిలుస్తూ నలుగురికి స్ఫూర్తినిస్తుందని నెటిజన్లు అంటున్నారు. మరి లోక్‌సభ ఎన్నికల్లో బర్రెలక్కకు వచ్చిన ఓట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker