News

హైదరాబాద్‌లో మెడికల్ షాప్ లో బిల్లింగ్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి.

మెదడు, ఇతర శరీర అవయవాలు, కణజాలాలకు రక్తం, ఆక్సిజన్‌ను పంపింగ్ చేయడంలో ఇబ్బంది తలెత్తితే కార్డియాక్‌ అరెస్ట్ సంభవిస్తుంది. రక్త ప్రసరణలో ఆకస్మిక ఇబ్బంది తలెత్తి మెదడు దెబ్బతినడం, ఒక్కోసారి మరణం సంభవిస్తుంది. అయితే ఎవరైనా కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైతే వెంటనే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) చేయాలి. ఒకవేళ సకాలంలో సీపీఆర్‌ చేయకుంటే కార్డియాక్ అరెస్ట్ సంభవించిన 5 నిమిషాలకు మెదడు దెబ్బతినే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ సంభవించిన 8 నిమిషాలలోపు సీపీఆర్‌ చేయకపోతే మరణం కూడా సంభవించే అవకాశం ఉంది.

అయితే హైదరాబాద్ శివారు ప్రాంతమైన మేడ్చల్ మల్కాజ్ గిరి ప్రాంతంలోని కీసర గ్రామంలో ఈ ఘోరం జరిగింది. కీసరలోని మెడ్స్ అనే మెడికల్ షాపులో మురళీ అనే వ్యక్తి ఫార్మాసిస్టుగా పని చేస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటూ… అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. ఇక ఇదే సమయంలో గురువారం ఉదయం గుండెపోటుతో మురళి కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోను పరిశీలించినట్లు అయితే ఓ ఇద్దరు వ్యక్తులు మందుల కోసం మెడ్స్ మెడికల్ షాపులోకి వచ్చారు. వారికి కావాల్సిన మందులను మురళి ఇచ్చాడు.

ఆ తర్వాత సదరు వ్యక్తులు తీసుకున్న బిల్లింగ్ చేస్తుండగా.. అస్వస్థకు గురయ్యాడు. బిల్లింగ్ చేస్తూనే ఒక వైపు ఒరిగిపోయాడు. అనంతరం పక్కనే ఉన్న గోడకు తగులుతూ నేలపై ఒరిగిపోయాడు. ఇక వెంటనే గమనించిన తోటి సిబ్బంది అతడికి సపర్యలు చేశారు. ఫిట్స్ వచ్చిందని భావించి.. అతడి చేతిలో ఇనుప వస్తువు పెట్టి..గట్టిగా పట్టుకుని ఉంచాడు. కాసేపటికి మురళి చలనం లేకుండా పడిపోయాడు. స్థానికుల సహయంతో మురళీని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడిని పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో చనిపోయినట్లు వెల్లడించారు.

దీంతో మృతుడి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఇక అతడు హర్ట్ ఎటాక్ కు గురికావటం, క్షణాల్లోనే కుప్పకూలి మరణించడం దుకాణంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాక ఆ దృశ్యాన్ని చూసిన జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆరోగ్యంగా కనిపించిన మనిషి..క్షణాల్లో ఇలా విగతజీవిగా మారడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker