యాక్సిడెంట్ కు గురైన ఉపాసన తాతయ్య, ఆందోళనలో మెగా కోడలు.
ఉపాసన మెగా ఇంటికోడలుగా అడుగుపెట్టిన తర్వాత ఈమె మెగా ఇంటి పరువు ప్రతిష్టలను ఉన్నత శిఖరానికి చేర్చారు. ఇక ఉపాసన ఇంటి బాధ్యతలను మాత్రమే కాకుండా అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబెడుతూ ఉంటారు.అయితే అపోలో హాస్పిటల్ ఫౌండర్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారి మనవరాలుగా ఉపాసన మరింత పేరు ప్రఖ్యాతలు పొందారు.
అయితే మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాతయ్య, అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం జరిగింది. చెన్నైలో ప్రతాప్ రెడ్డి కారులో వెళ్తుండగా ఒక వ్యాన్ ఆయన కారుపైకి దూసుకొచ్చింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. దీంతో కామినేని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఉపాసన రామ్ చరణ్ సతీమణిగా, మెగా కోడలిగా ఉంటూనే అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా గతేడాది ఉపాసన, రామ్ చరణ్ దంపతులకు క్లీంకారా అనే పాప పుట్టింది. ఒక పక్క పాపను చూసుకుంటూనే మరోపక్క అపోలో హాస్పిటల్ కి సంబందించిన హెల్త్ మ్యాగజైన్ కోసం ఇంటర్వ్యూలు చేస్తున్నారు.
ఇక రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. ఇక బుచ్చిబాబు సన దర్శకత్వంలో మరొక మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.