News

బిల్వ పత్రం పరగడుపున తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

శివలింగార్చనతో కూడిన శివపూజకు బిల్వ పత్రం అత్యంత శ్రేష్టమైనది. శివార్చనలో మారేడుకు చాలా ప్రాముఖ్యత ఉందని, ఈ ఆకులతో పరమశివుణ్ణి పూజించడం పరిపాటి అని ప్రముఖ ఆధ్యాత్మి కవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ బిల్వపత్రం అపురూపమైనది. ఆకులు విశిష్ట ఆకారంలో ఉంటాయి. మూడు ఆకులు ఒకే సమూహంగా ఉన్నట్టు కనిపిస్తాయి. అలనాడు భక్తకన్నప్ప మారేడు దళాలతో శివుణ్ణి పూజించి మోక్షప్రాప్తి పొందాడు. అయితే హిందూ సంప్రదాయంలో బిల్వ పత్రాన్నిఎంతో పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. వీటిని ఎక్కువగా శివ పూజలో కూడా ఉపయోగిస్తారు.

మూడు ఆకులు కలిపి ఉండే ఈ బిల్వ పత్రం మొక్కను ప్రతి ఇంట్లో కూడా పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకుంటుంది. అంతే కాకుండా ఇంటికి అదృష్టాన్ని కూడా తెచ్చి పెడుతుందని నమ్ముతారు. ఈ చెట్టుకు బిల్వ పండు కూడా ఉంటుంది. బిల్వ చెట్టు, ఆకులు, పండ్లలో ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయి. బిల్ల ఆకులను ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుదల:- శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. లేదంటే రోగాల బారిన పడుతూ ఉంటారు. వాటిని తట్టుకునే శక్తి కూడా ఉండదు.

బిల్వ పత్రంలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఆకుల్ని మీ డైలీ రొటీన్‌లో చేర్చుకుంటే చాలా మంచిది. పరగడుపున బిల్ల పత్రం ఆకు లేదా బిల్వ ఆకుల నీటిని తాగినా చాలా మంచిది. దీంతో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. జలుబు, దగ్గును తగ్గిస్తుంది. మీ శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది. గుండె ఆరోగ్యం:- బిల్వ చెట్టు ఆకుల్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఎందుకంటే ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లభిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయ పడతాయి. వీటిని తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. గుండె సంబంధిత సమస్యల్ని కూడా తగ్గిస్తుంది.

డయాబెటీస్ కంట్రోల్:- బిల్వ పత్రాలను తీసుకోవడం వల్ల డయాబెటీస్ కూడా నియంత్రణలోకి వస్తుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలను పెంచి కాలేయంలోకి గ్లూకోజ్‌ని నిర్వహిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది. ఖాళీకడుపున తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండు:- బిల్వ పత్రంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. ఆయుర్వేదంలో కూడా ఎన్నో ఔషధాల్లో బిల్ పత్రాన్ని ఉపయోగిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker