నా జీవితం నాశనం చేశారంటూ యూట్యూబర్‌పై రెచ్చిపోయిన బర్రెలక్క. వైరల్ వీడియో.
ఎన్నికల ప్రచార సమయంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె పెళ్లి, ఆ తర్వాత జరిగిన పరిణమాలను బర్రెలక్క తండ్రి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఆమెపై కొందరు నెగిటివ్‌గా ప్రచారం చేశారు. తాజాగా ఆ యూట్యూబర్ స్టూడియోకు వెళ్లిన బర్రెలక్క.. ఇంటర్వ్యూ చేసిన యాంకర్‌పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో శీరిష పోటీ చేయడంతో సంచలనంగా మారింది. నిరుద్యోగుల తరుపున తాను అసెంబ్లీలో పోరాడుతానంటూ ప్రచారం చేయడంతో యువతలో ఆశలు రేకెత్తాయి. దీంతో కొందరు నేరుగా ఆమెకు మద్దతుగా ప్రచారం చేయగా.. మరికొందరు సోషల్ మీడియా ద్వారా సపోర్టుగా నిలిచారు. ఈమెకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీతో పాటు అమెరికా నుంచి కూడా కొందరు మద్దతు పలకడం విశేషంగా మారింది.
ఒక దశలో శిరీష అసెంబ్లీలో అడుగుపెడుతానని అందరూ అనుకున్నారు. అయితే 5 వేల ఓట్లు మాత్రమే రావడం చర్చనీయాంశంగా మారింది. తనకు తక్కువ ఓట్లు రావడానికి తన గురించి తప్పుగా ప్రచారం చేయడమేని అసెంబ్లీ రిజల్ట్ సందర్భంగా శిరీష తెలిపింది. కొన్ని రోజుల కిందట తన గురించి ప్రచారం చేసిన ఓ యూట్యూబర్ పై ఆమె ఫైర్ అయింది. అంతేకాకుండా ఆ వ్యక్తి చెంప చెల్లుమనిపించింది.
తన తండ్రికి డబ్బులిచ్చి తన గురించి తప్పుగా ప్రచారం చేశావని, తన పరువు తీశావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్ కావడంతో హాట్ టాపిక్ గా మారింది.
ఎన్నికల సమయంలో తన తండ్రితో వీడియో తీయించి తన ఓట్లు తగ్గేలా చేసాడని ఒక యూట్యూబ్ ఛానల్లో రెచ్చిపోయిన బర్రెలక్క. pic.twitter.com/2FhTsWeauP
— Actual India (@ActualIndia) February 1, 2024