News

మీ దగ్గర ఏటీఎం కార్డు ఉందా..? మీరు ఉచితంగా రూ.5 లక్షలు పొందొచ్చు. ఎలాగంటే..?

క్షణాల్లో పేమెంట్లు జరిగిపోతాయి. దీని ద్వారా పిన్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. ట్యాప్ అండ్ పే టెక్నాలజీని ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్నారు. మన దేశంలోనూ చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ ఆప్షన్ అదిస్తున్నాయి. అయితే డెబిట్ కార్డు కలిగిన వారికి ఉచిత ప్రయోజనాలు కూడా లభిస్తాయి. వీటిల్లో ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా ఒకటి. దాదాపు చాలా బ్యాంకులు వాటి కస్టమర్లకు డెబిట్ కార్డుపై ఉచిత ఇన్సూరెన్స్ సదుపాయం అందిస్తూ ఉంటాయి. అయితే బ్యాంక్ ప్రాతిపదికన ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది మారుతూ ఉండొచ్చు.

ఇంకా ఏటీఎం కార్డు వేరియంట్ ఆధారంగా కూడా ఇన్సూరెన్స్ మొత్తంలో మార్పు ఉండే ఛాన్స్ ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఏకంగా రూ.కోట్లలో కూడా ఉచిత ఇన్సూరెన్స్ బెనిఫిట్ కల్పిస్తూ ఉంటాయని గుర్తించాలి. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ రూపంలో ఈ ఉచిత ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఉంటుంది. బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే ఉచితంగానే ఈ ప్రమాద బీమా పొందే వెసులుబాటు ఉంది. అంతేకాకుండా ఎలాంటి డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సిన పని లేదు.

బ్యాంకులు తమ ఏటీఎం వినియోగదారులకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. అయితే ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ అని గుర్తించుకోవాలి. అందుకే ఇండిపెండెంట్ పాలసీ నెంబర్ అనేది కార్డ్ హోల్డర్‌కు అందుబాటులో ఉండవు. అయితే బ్యాంక్ కస్టమర్లు ఈ ఉచిత ఇన్సూరెన్స్ బెనిఫిట్ పొందాలని భావిస్తే.. కొన్ని రూల్స్ ఫాలో అవాల్సి ఉంటుంది. కచ్చితంగా డెబిట్ కార్డును వినియోగిస్తూ ఉండాలి. లేదంటే ఈ బెనిఫిట్ మిస్ అవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెట్‌సైట్ ప్రకారం చూస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మిలినియా డెబిట్ కార్డు కలిగిన వారు రూ. 5 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం పొందొచ్చు.

డొమెస్టిక్ ఎయిర్, రైల్, రోడ్ ట్రావెల్ ప్రమాదాలకు ఇది వర్తిస్తుంది. అదే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ అయితే అప్పుడు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ రూ. 1 కోటి వరకు లభిస్తుంది. ఈ కార్డుపై ఇన్సూరెన్స్ సేవలు యాక్టివేట్‌లో ఉండాలంటే.. కార్డును గత నెల రోజుల్లో కచ్చితంగా ఒక్కసారైన ఉపయోగించి ఉండాలి. కోటక్ మహీంద్రా బ్యాంక్ క్లాసిక్ డెబిట్ కార్డు విషయానికి వస్తే.. గత నెల రోజుల్లో కనీసం రూ.500 విలువైన రెండు ట్రాన్సాక్షన్లు నిర్వహించి ఉండాలి.

డీబీఎస్ బ్యాంక్ ఇన్‌ఫినిటీ డెబిట్ కార్డు అయితే 90 రోజుల్లో కనీసం ఒక్క ట్రాన్సాక్షన్ అయినా నిర్వహించాలి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందాలంటే.. నామినీ కాంటాక్ట్ వివరాలు, క్లెయిమ్ ఫామ్, ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్, పోస్ట్ మార్టమ్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్, డెబిట్ కార్డు వివరాలు, మీడియా లేదా న్యూస్ పేపర్ క్లిప్పింగ్ వంటివి అవసరం అవుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker