News

‘కిర్రాక్‌ ఆర్పీ నెల్లూరు చేపల పులుసు చాలా కాస్ట్‌లీ’ రేట్లు ఎక్కువ అన్నవారిపై కిర్రాక్ ఆర్పీ ఫైర్.

కమెడియన్ గా నెల్లూరు యాసను ఎలా ఉపయోగించుకున్నాడో.. ఈసారి అదే నెల్లూరు ఫేమస్ డిష్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ను బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాడు. హైదరాబాద్ లో ఒక్క బ్రాంచ్ తో స్టార్ట్ చేసి.. సక్సెస్ ఫుల్ గా నాలుగైదు బ్రాంచ్ లతో రెండు తెలుగు రాష్ట్రాలలో తన బిజినెస్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ డిష్ ఫేమస్ అవ్వడానికి ఆర్పీకి ఉన్న జబర్థస్త్ ఇమేజ్ బాగా ఉపయోగపడింది అనేది అందరికి తెలిసిన సత్యం.

మొదట కూకట్‌ పల్లిలో నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు అంటూ కర్రీ పాయింట్‌ను ఓపెన్‌ చేసిన కిర్రాక్‌ ఆర్పీ ఆ తర్వాత మణికొండ, అమీర్‌ పేట తదితర ప్రాంతాల్లో బ్రాంచ్‌లు కూడా ఓపెన్‌ చేశాడు. ఆ తర్వాత ఏపీలోకి కూడా అడుగు పెట్టాడు. నెల్లూరు, తిరుపతిలోనూ నెల్లూరు చేపల పులుసు కర్రీ పాయింట్లు ఓపెన్‌ చేశాడు. బిజినెస్‌ కూడా బాగానే ఉందంటున్నాడబు కిర్రాక్ ఆర్పీ. అదే సమయంలో అతని చేపల పులుసు కర్రీ పాయింట్‌లో కూరలు చాలా కాస్ట్‌లీ ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన ఆర్పీ తన దైన శైలిలో సమాధానమిచ్చాడు.

‘మీరు కిలో చికెన్‌ కొంటే కిలో చేతిక వస్తుంది. మటన్‌ కూడా అంతే. కానీ కిలో చేప తీసుకుంటే మాత్రం కిలో రాదు. తల కాయ, తోకా పోతాయి. మధ్యలో ఉండే పీసులే నేను అమ్మాలి. ఇతర కూరల్లో వేసిన దానికి వంద రెట్లు ఎక్కువగా చేపల కూరలో నూనే వేయాలి. రుచి కోసం మామిడి కాయలు కూడా జత చేయాలి. అవి కూడా చాలా రేట్లు పలుకుతున్నాయి. ఇవొక్కటే కాదు.. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఆఖరిలో వేసే మసాలా, కొత్తిమీర.. ఇలా చేపల కర్రీకి ఉపయోగించే పదార్థాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే నా కర్రీపాయింట్‌లో ధరలు ఉన్నాయి.

ఎవరూ కూడా కావాలని అత్యధిక రేట్లు పెట్టరు. రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల వ్యాపారం జరగదు అని తెలిసినప్పుడు నేను రేట్లు ఎందుకు ఎక్కువ పెడతాను. ఇది మామూలు రిస్కీ బిజినెస్ కాదు. నేను కూడా నాసిరకమైన చేపలు తెచ్చి అల్లం పేస్ట్ కలిపి ఊరికే కూడా ఇస్తాను. మీరు మంచి చేపలు తిని బాగుండాలని కోరుకుంటున్నా కాబట్టి రేట్లు అలా పెట్టవలసి వస్తుంది’ అంటూ నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు రేట్లపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చాడు కిర్రాక్‌ ఆర్పీ.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker