రాత్రి నిద్రపోయే ముందు నీళ్లలో ఓ స్పూన్ ఇది కలిపి స్నానం చేస్తే ఆ సమస్యలన్నీ దూరం.

బాత్ సాల్ట్ అనేవి ఖనిజాలు కలిసిన ఉప్పు. దీన్ని కేవలం స్నానానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇప్పుడు చాలా రకాల ఉప్పులు మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిల్లో ముఖ్యమైనది మాత్రం ‘ఇప్సం బాత్ సాల్ట్’. ఈ ఉప్పు శరీరానికి, చర్మానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. హిమాలయన్ బాత్ సాల్ట్, డెడ్ సీ బాత్ సాల్ట్… ఇలా చాలా రకాల స్నానపు ఉప్పులు ఉన్నాయి. అయితే చాలా మంది స్నానానికి సబ్బు, బాడీ వాష్ లేదా షవర్ జెల్ వినియోగిస్తుంటారు.
కానీ చర్మాన్ని శుభ్రపరచడానికి ఇవి సరిపోవు. సబ్బులు, బాడీ వాష్‌లను ఉపయోగించడం కంటే చర్మ సంరక్షణకు బాత్ సాల్ట్ మంచిదంటున్నారు సౌందర్య నిపుణులు. బాత్ సాల్ట్‌తో స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. స్నానపు నీటిలో బాత్ సాల్ట్‌లను కలుపుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాత్ సాల్ట్‌లో పలు రకాల ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
చర్మం తేమ స్థాయిని నిర్వహించడానికి, నూనెల స్రావాన్ని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. బాత్ సాల్ట్ కలిపిన నీళ్లలో స్నానం చేయడం వల్ల చర్మం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. ఇది మృతకణాలను తొలగిస్తుంది. అలాగే చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. బాత్ సాల్ట్ చర్మ ఉపరితలంపై పేరుకుపోయిన కాలుష్య కారకాలను శుభ్రపరుస్తుంది. బాత్ సాల్ట్‌లు చర్మాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి.
ఇది చర్మం స్థితిస్థాపకతను తిరిగి పొందడంలోనూ సహాయపడుతుంది. చర్మం రక్త ప్రసరణను పెంచడంలో బాత్ సాల్ట్ సహాయపడుతుంది. ఇది చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. బాత్ సాల్ట్‌లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.
ఇది శరీరం, మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. బాత్ సాల్ట్ నీళ్లతో స్నానం చేయడం వల్ల రిలాక్సేషన్ వస్తుంది. రాత్రి పడుకునే ముందు బాత్ సాల్ట్ కలిపిన నీళ్లతో స్నానం చేస్తే నిద్రను మెరుగుపరుస్తుంది. అలాగే మెలటోనిన్ హార్మోన్ స్రావానికి సహాయపడుతుంది. బాత్ సాల్ట్స్ కలిపిన నీళ్ల స్నానం చేస్తే నిద్రలేమి దూరం అవుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.