Health

చికెన్ సూప్ ను ఇలా ఇంట్లోనే చేసి తాగితే దెబ్బకి జలుబు, దగ్గు అన్నీ తగ్గిపోతాయి.

నిజానికి చికెన్ కూర కన్నా శీతాకాలంలో చికెన్ సూప్ తింటేనే చాలా ఆరోగ్యం. చల్లని సాయంత్రం వేళ వేడి వేడి చికెన్ సూప్ తింటే ఆ రుచే వేరు. వేడి సూప్ పొట్టలోకి చేరగానే శరీరానికి చాలా చురుకుదనంతో పాటూ ఉత్తేజంగా అనిపిస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో చికెన్ సూప్ తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే రెస్టారెంట్లు, హోటల్స్ లో ఎక్కువగా లభించే వాటిల్లో చికెన్ సూప్ కూడా ఒకటి. ఇది ఎంతో టేస్టీతో పాటు హెల్దీ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సూప్ ను ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. రెస్టారెంట్ టేస్ట్ తో పాటు ఇంట్లో చేసుకుంటాం కాబట్టి నీటిగా కూడా ఉంటుంది.

జ్వరంగా ఉన్నప్పుడు ఏమీ తినాలనిపించనప్పుడు ఇలాంటివి చేసుకుని తాగితే బావుంటుంది. కాస్త నీరసం కూడా తగ్గుతుంది. గొంతు నొప్పి, దగ్గు, జలుబు, కఫం బాగా పట్టినప్పుడు చికెన్ సూప్ చేసుకుని తాగితే దెబ్బకు పరార్ అవుతాయి. ఇంట్లో చికెన్ సూప్ చేసుకుని తాడం కూడా ఈజీనే. మొదట కాస్త కష్టమనిపించినా.. ఆ తర్వాత సింపుల్ గా చేసేసుకోవచ్చు. చికెన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు:- చికెన్ బోన్ లెస్ (కావాలనుకున్న వారు బోన్స్ తో కూడా తీసుకోవచ్చు) 150 గ్రాములు , నెయ్యి లేదా నూనె – కొద్దిగా , సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1,

సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు – 1, స్ప్రింగ్ ఆనియన్స్ – కొద్దిగా, కొత్తి మీర – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – కొద్దిగా, ఉప్పు – సరిపడినంత, మిరియాల పొడి – కొద్దిగా, సోయా సాస్ – కొద్దిగా, టమాటా సాస్ – కొద్దిగా, చిల్లీ సాస్ – కొద్దిగా, వెనిగర్ – కొద్దిగా, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, కోడి గుడ్డు – 1, తయారీ విధానం:- ముందుగా ఒక మందపాటి కడాయి తీసుకుని కాస్త నూనె వేసుకుని చికెన్ ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి. లోపల అంతా ఉడికేలా మధ్యస్థ మంటపై రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.

ఆ తర్వాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని కాస్త చల్లారనివ్వాలి. నెక్ట్స్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, పక్కకు పెట్టుకోవాలి. నెక్ట్స్ మళ్లీ కడాయి వేడి చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి లేదా నూనె కొద్దిగా వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని వేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, క్యారెట్, ఉప్పు వేసి పెద్ద మంటపై బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ ముక్కలకు బాగా పట్టాక.. నీళ్లే వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి నీళ్లు బాగా మరిగించాలి.

నీరు మరిగిన తర్వాత మిరియాల పొడి, వెనిగర్, టమాటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి బాగా కలపాలి. ఈ నీటిని మరో మూడు నిమిషాల పాటు మరిగించాలి. ఈ లోపు మరో గిన్నెలో ఎగ్ ని చితకకొట్టి వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని సూప్ లో వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ వాటర్ కూడా వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ సూప్ రెడీ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ చికెన్ సూప్ సిద్ధం అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker