News

అందర్నీ పిచ్చోళ్లను చేస్తున్న BCCI, IPL అంతా ఫిక్సింగే, ఈ వీడియో నే సాక్ష్యం.

గతంలో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాల నేపథ్యంలో మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా బీసీసీఐ, ఐపీఎల్ నిర్వహకులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఫిక్సింగ్‌ను అడ్డుకునేందుకు బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్(ఏయూసీ)ని కూడా ఏర్పాటు చేసింది, అయితే ఈ సీజన్​లో మ్యాచులన్నీ ఫిక్సింగ్ అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మ్యాచుల్లో టాస్​ విషయంలో ఫిక్సింగ్ జరుగుతోందని, ఇక్కడి నుంచే ఎవరు విజేతనేది ముందే డిసైడ్ అవుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

టాస్​కు రెండు వైపులా హెడ్స్ ఉండేలా చూసుకుంటున్నారని, ఏ టీమ్ టాస్ నెగ్గాలనేది ముందే ప్లాన్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. లక్నో సూపర్ జియాంట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ టాసే దీనికి బిగ్ ఎగ్జాంపుల్ అంటున్నారు. ఆ మ్యాచ్​కు సంబంధించిన టాస్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో టాస్ కాయిన్​కు రెండు వైపులా హెడ్స్ ఉందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు. ఆడియెన్స్​ను పిచ్చోళ్లని చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ మొత్తం ఫిక్సింగేనని విమర్శలు చేస్తున్నారు నెటిజన్స్.

ఇంత పబ్లిక్​గా ఫిక్సింగ్ చేయడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎవరెవరి హస్తం ఉందో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే లక్నో-డీసీ మ్యాచ్ టాస్ వీడియోను సరిగ్గా గమనిస్తే ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదనిపిస్తోందని క్రికెట్ లవర్స్ అంటున్నారు. ఆ టాస్ కాయిన్​కు ఒకవైపు H (హెడ్స్), మరోవైపు T (టెయిల్స్) ఉన్నాయి. అయితే కాయిన్​ను ఫుల్ స్పీడ్​గా తిప్పడంతో అది అర్థం కావట్లేదు. ఇది తెలుసుకోకుండా.. ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు.

ఐపీఎల్​లో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నిర్వహిస్తున్నారని.. మెగా లీగ్ మీద బురద జల్లడం కరెక్ట్ కాదని అంటున్నారు. మరి.. ఐపీఎల్ అంతా ఫిక్సింగే అనే ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker