అబ్దుల్ కలాంతో ఉన్న ఈ పాపని గుర్తుపట్టారా..? ఇప్పుడు ఏకంగా చిరంజీవి పక్కనే నటిస్తుంది.
జమ్ము కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చాలా మంది బ్యూటీస్.. వెండితెరపై వెలిగేందుకు వస్తూనే ఉన్నారు.. అలరిస్తూనే ఉన్నారు. బిగ్ స్క్రీన్‌లోకి రాకముందు పలు యాడ్స్ చేశాక.. సినిమా అవకాశాలను సంపాదిస్తున్నారు. సాధారణంగా ఓ హీరోయిన్ ఆయా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి .. అక్కడ క్రష్ అన్న ముద్ర వేయించుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మడు మాత్రం పరభాష చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అయితే దివంగత మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించే శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పక్కన నిలబడి ఉన్న స్టూడెంట్ ఇప్పుడో హీరోయిన్.
ఢిల్లీలో పుట్టిన ఈమె ఆర్ట్స్ డిగ్రీ కాలేజ్ లో ఫైన్ ఆర్ట్స్ చేసింది. ఆ టైంలో సినిమాలంటే ఆసక్తి ఏర్పడింది. దీంతో యాక్టింగ్ స్కూల్లో చేరింది. అక్కడ ప్రముఖ దర్శకుడు బేరీ జాన్, నటుడు మనోజ్ బాజ్ పాయ్ ల దగ్గర యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంది. తమిళ హీరో విక్రమ్ ప్రభు నటించిన ఇవన్ వెరమథిరి మూవీతో హీరోయిన్ గా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈమె.. రెండో సినిమాతోనే ధనుష్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. ధనుష్ హీరోగా వచ్చిన వీఐపీ (తెలుగులో రఘువరన్ బీటెక్) మూవీలో నటించింది.
తెలుగులో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పేరు ఇంట్లో దాచుకునే వస్తువుతో ముడిపడి ఉంటుంది. అదేనండి.. చీరలు, నగలు పెట్టుకునే బీరువా. ఆ బీరువాలోనే ఈ హీరోయిన్ నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత శర్వానంద్ సరసన ఎక్స్ ప్రెస్ రాజా అనే మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. మంచు వారబ్బాయి నటించిన ఎటాక్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ..
ఆ తర్వాత నాని జెంటిల్ మన్ సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఒక్క క్షణం, ఓటర్, శశి, సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు ఆశించిన విజయాలను నమోదు చేయలేదు. ప్రస్తుతం అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు సురభి. బీరువా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ బ్యూటీనే ఈ ఫోటోలో ఉన్న చిన్నారి. స్కూల్లో చదువుతున్న సమయంలో అబ్దుల్ కలాం గారితో కలిసి ఫోటో దిగింది.