News

స్టార్ హీరోను చెంపదెబ్బ కొట్టిన ప్రముఖ విలన్, ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

అమ్రీష్ పురి ప్రముఖ భారతీయ నటుడు. ఇతని సోదరులు మదన్ పురి, చమన పూరి కూడా భారతదేశ ప్రముఖ నటులు. ఇతడు తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించాడు. అయితే భారతీయ చలనచిత్ర చరిత్రలో తన లాంటి ‘విలన్’ని మనం చాలా ఇప్పుడు చూడటం కష్టం. ‘మొగాంబో ఖుష్ హువా’ వంటి డైలాగ్‌లు ఇప్పటికీ కూడా జనం నోట్లో నానుతున్న ఆ నటుడు మరెవరో కాదు.. అమ్రిష్ పూరి.

అయితే దాదాపు 450 చిత్రాలలో పనిచేసిన అమ్రిష్ పూరి సమయపాలనకు పేరుగాంచాడు . తన సమయానికి ప్రాముఖ్యతనిచ్చాడు. అతని పని విధానం పరిశ్రమలో చాలా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు అమ్రిష్ పూరి, గోవింద కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా అమ్రిష్ పూరి వచ్చారు .

కానీ గోవింద మాత్రం కనిపించలేదు. మీడియా నివేదికల ప్రకారం, గోవింద సెట్‌కి దాదాపు 9 గంటలు ఆలస్యంగా వచ్చాడు , దీని తర్వాత అమ్రిష్ పూరి చాలా కాలం వేచి చూసి.. తనకున్న సహనం కోల్పోయి గోవిందాను చెంపదెబ్బ కొట్టాడు. అమ్రీష్ పూరీతో జరిగిన ఈ సంఘటన గోవిందాను ఎంతగానో కలతపెట్టిందని, ఇకపై అమ్రిష్ పూరితో కలిసి పనిచేయనని ప్రమాణం చేశాడని నివేదికలు చెబుతున్నాయి.

మిస్టర్ ఇండియాలో మొగాంబో, త్రిదేవ్‌లో భుజంగ్, ఘయల్‌లో బల్వంత్ రాయ్, దామినిలో బారిస్టర్ చద్దా , కరణ్ అర్జున్‌లో ఠాకూర్ దుర్జన్ సింగ్ వంటి అనేక విలన్ పాత్రలు పోషించారు అమ్రిష్ పూరి , ఆయన చేసిన అనేక పాత్రలు ఇప్పటికీ సినీ అభిమానులకు గుర్తుండిపోతాయి. తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి చేసిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో కూడా అమ్రిష్ పూరి విలన్‌గా నటించి తెలుగు ప్రజల్లోకూడా చెరగని ముద్ర వేసుకున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker