మీరా జాస్మిన్ ఇంట్లో విషాదం. అనారోగ్య సమస్యలతో హీరోయిన్ తండ్రి మృతి.
మీరా జాస్మిన్.. సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీగా ఉంటున్న సమయంలోనే దుబాయ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ ను 2014లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న మీరా.. ఇప్పుడిప్పుడే తిరిగి రీఎంట్రీ ఇస్తుంది. మొదటి నుంచి మీరా తన వ్యక్తిగత విషయాలను… తన కుటుంబం గురించి ఎక్కడా బయటపెట్టలేదు. అంతేకాదు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను సైతం ఎక్కడా షేర్ చేయలేదు..
మీరా పర్సనల్ లైఫ్, వైవాహిక జీవితం గురించి ఎవరికీ తెలియదు. అయితే గుడుంబా శంకర్’ఫేం మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ (83) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. వృద్థాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఎర్నాకులం లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
దీంతో మీరా జాస్మిన్ ఇంట విషాదచాయలు నెలకొన్నాయి. జోసెఫ్ ఫిలిప్‌కు భార్య ఎలియమ్మ, సారా, జేని, జార్జ్, జాయ్, మీరా అని ఐదుగురు సంతానం ఉన్నారు. వీరిలో మీరా జాస్మిన్ అందరిలో కంటే చిన్నది. మీరా జాస్మిన్.. సూత్రధారన్ అనే మలయాళ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. రన్ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి బాగుంది చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
పందెం కోడి, గుడుంబా శంకర్, భద్ర, రారాజు, మహారథి, యమగోళ మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటి పిల్లాడు.. వంటి చిత్రాల్లో నటించారు. 2014లో దుబాయ్ ఇంజనీర్ అనిల్ జాన్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. గతేడాది విమానం చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.