Health

పడుకునే ముందు ఒక గ్లాస్ నీరు తాగమని డాక్టర్స్ ఎందుకు చెప్తారో తెలుసా..?

రాత్రి నిద్రించే ముందు వేడి నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సజువుగా జరుగుతుంది. ప్రతి రోజు పడుకునే ముందు వేడి నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థను బలోపేతం అవడంతో పాటు మలబద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లు తాగితే మరుసటి రోజు పొట్ట క్లియర్ అవుతుంది. అయితే మన శరీరంలో ఎక్కువ భాగం నీటితోనే నిర్మితమై ఉంటుంది. అందుకే సరైన మోతాదులో క్రమం తప్పకుండా నీరు తాగడం అవసరం.

లేదంటే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీనివల్ల అనేక ఇతర సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యవంతమైన పెద్దలు రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. అయితే రాత్రి పూట నీళ్లు తాగాలా వద్దా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. దీనివల్ల కొందరికి లాభాలు ఉంటే మరికొందరు ఇబ్బంది పడుతుంటారు. రాత్రిపూట నీళ్లు తాగాలా వద్దా.. రాత్రి నిద్రపోయే ముందు నీరు తాగడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది కాకుండా నీటి కారణంగా విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందుతాయి.

నీరు తాగడం వల్ల జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలను బయటకు తీయడంలో ఎటువంటి సమస్య ఉండదు. నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తక్కువ నీరు తాగే వారి శరీరంలో మలినాలు పేరుకుపోతాయి. దీనివల్ల శరీరం వాటిని డిటాక్సిఫై చేయలేక చాలా ఇబ్బందిపడుతుంది. అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మీరు పగటిపూట ఎక్కువ నీరు తాగడం మంచిది. అలాగే రాత్రి నిద్రించడానికి కొన్ని గంటల ముందు నీరు తాగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు.

కానీ నిద్రపోయే ముందు ఎక్కువ నీరు తాగితే నిద్రభంగం కలుగుతుంది. ఇలాంటి వారు ఎక్కువ నీరు తాగకూడదు మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బులతో బాధపడేవారు రాత్రిపూట ఎక్కువ నీరు తాగకూడదు. దీనివల్ల వారు పదే పదే టాయిలెట్‌కు వెళ్లవలసి ఉంటుంది. వారి నిద్ర చక్రం పూర్తిగా చెదిరిపోతుంది. అవసరమైన 8 గంటల నిద్రను పూర్తి చేయలేరు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. రాత్రి ఎన్ని నీళ్లు తాగాలి? సాధారణ నీరు తాగడానికి బదులుగా నిమ్మకాయ నీరు, గ్రీన్ టీ, హెర్బల్ టీ, ఇతర ఆరోగ్యకరమైన పానీయాలు తాగడం ఉత్తమం.

మామూలు నీరు ఎక్కువగా తాగితే మూత్ర విసర్జనకు పదే పదే లేవడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. రాత్రిపూట ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు మాత్రమే తాగడం మంచిది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రాత్రిపూట నీరు ఎందుకు తాగాలి.. రాత్రి భోజనం తర్వాత నీరు తాగడం వల్ల శరీరం సహజంగా శుభ్రమవుతుంది. నీరు విష పదార్థాలను బయటకు పంపి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎసిడిటీ, గ్యాస్‌ సమస్య ఉన్నవారు రాత్రిపూట నీళ్లు తాగాలి. జలుబు, ఫ్లూ రోగులకు గోరువెచ్చని నీరు దివ్యౌషధం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker