Health

మామిడి పండ్లు ఎక్కువగా తింటే మీ కడువులో ఏం జరుగుతుందో తెలుసుకోండి.

మామిడి పండ్లలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు.. శరీరం డీ హైడ్రేషన్ కు గురవకుండా వేసవిలో వచ్చే వ్యాధుల నుంచి మామిడి కాపాడుతుంది. అయితే, మామిడి పండ్లను ఎక్కువగా తింటే శరీరానికి హాని కలుగుతుంది. అతిగా తినడం వల్ల విరేచనాలు, కడుపునొప్పి, అల్సర్లు, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అందుకే మితంగా తినాలి. రోజులో ఒక తినడం వల్ల మేలు జరుగుతుంది. అది కూడా ఒక కాయను రెండు సమయాల్లో తింటే ఇంకా మేలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ సీజన్‌లోనైనా కొన్ని రకాల పండ్లు లభిస్తాయి. అవి ఆ సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. అలాగే ఎండాకాలంలో పండ్లలో రారాజు అయిన మామిడి లభిస్తుంది. దీనిని చాలామంది ఎంతో ఇష్టంతో తింటారు. ఎందుకంటే సీజన్ అయిపోయిన తర్వాత ఇవి లభించవు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాల మామిడిపండ్లు దొరుకుతాయి.

వీటిలో విటమిన్లు, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. మామిడిపండ్లు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటు వేసవిలో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుతుంది. కానీ మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల కూడా శరీరానికి హాని కలుగుతుంది. మామిడిపండును ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, విరేచనాలు, కడుపునొప్పి, అల్సర్లు, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మామిడిపండ్లు పురుగుమందులు, కృత్రిమంగా పండించిన కారణంగా కనీసం 2 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత మాత్రమే తినాలి. మామిడి పండ్లలో ఫ్రక్టోజ్ అని పిలువబడే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. కొంత మందికి మామిడిపండ్లు అంటే ఎలర్జీ, తింటే గొంతు వాచిపోతుంది. అందరూ వీటిని జీర్ణం చేసుకోలేరు. ఈరోజుల్లో మామిడి పండ్లను పండించడానికి రసాయనాలు వాడుతున్నారు. అంతే కాకుండా వీటిని పండించడానికి కూడా అనేక రకాల క్రిమిసంహారక మందులను వాడుతున్నారు.

దీని కారణంగా చక్కెర స్థాయి పెరుగుదల, ట్రైగ్లిజరైడ్ స్థాయిలో అసమతుల్యత ఏర్పడుతుంది. మామిడిపండ్లు పూర్తిగా పనికిరానివి అని కాదు మామిడిపండ్లు ఆరోగ్యకరమే కానీ మితంగా తింటే మాత్రమే. ఒక రోజులో మొత్తం మామిడికాయను ఒకేసారి తినే బదులు దానిని రెండు భాగాలుగా చేసి రెండుసార్లు తినడం ఉత్తమం. ఇందులో ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉన్నందున ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుందని గుర్తుంచుకోండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker