Health

బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న తల్లులు పిల్లలకు పాలు ఇవ్వొచ్చా. చాలా మంది తెలియక ఆ తప్పు చేస్తున్నారు.

2020 డేటా ప్రకారం, క్యాన్సర్ వల్ల దాదాపు 10 మిలియన్ల మంది మరణిస్తుంటే.. అందులో 2.26 మిలియన్ మంది రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయారని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మన దేశంలో ఏటా దీని బారిన పడేవారు లక్షల్లో ఉంటున్నారంటే ఈ వ్యాధి తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా వయస్సు 40 ఏళ్లు దాటిన వారికి బ్రెస్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. కానీ, 30 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్నవారినీ ఈ మహమ్మారి ఎటాక్‌ చేస్తుంది. సరైన అవగాహన ఉంటే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే.. ప్రాణాంతకం కాదని నిపుణులు చెబుతున్నారు.

అయితే పిల్లలకు తల్లి పాలు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లలకు తల్లి పాలు ఇవ్వడం చాలా శ్రేయస్కరం. బిడ్డకు తల్లి పాలు ఇస్తేనే.. మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. అంతే కాకుండా పిల్లలు దీర్ఘకాలంగా ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి పాలు తప్పసరిగా ఇవ్వాలి. తల్లి పాలు తాగితేనే బిడ్డలకు, తల్లికి చాలా మంచిది. తల్లి పాల వల్లనే పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు. అయితే ఇంతకీ మరి బ్రెస్ట్ క్యాన్సర్ తో ఇబ్బంది పడే మహిళలు.. పిల్లలకు పాలు ఇవ్వాచ్చా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది ఈ విషయంలో ఎన్నో మహిళలు తర్జన భర్జన పడుతూంటారు. పాలు ఇచ్చే సమయంలోనే ఈ లక్షణాలు గుర్తించవచ్చు:- బ్రెస్ట్ క్యాన్సర్ పాలను ఉత్పత్తి చేసే లోబుల్స్, పాల నాళాలులోనే వస్తుంది. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ని గర్భాధారణ సమయంలో గుర్తించడం కష్టం. ముఖ్యంగా పిల్లలకు పాలిచ్చే సమయంలోనే ఈ లక్షణాలు అనేవి కనిపిస్తాయి. కాబట్టి అవి పాలు ఇవ్వడం వల్ల కలిగేవి కూడా కావచ్చు. అన్ని లక్షణాలు క్యాన్సర్ వల్లనే అని అనుకుంటే మాత్రం పొరపాటే.

కీమో థెరపీ చేయించుకుంటే పాలు ఇవ్వకూడదు:- కాన్పు అయ్యాక ఒక్కోసారి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తాయి. తల్లి పాలు ఇచ్చే సమయంలో కీమో థెరపీ చేయించుకుంటే పిల్లలకు పాలు ఇవ్వక పోవడమే మంచిది. ఈ సమయంలో శిశువుకి పాలు ఇవ్వడం వల్ల కీమో థెరపీ మందులు కూడా పాలలో కలిస్తాయి. దీంతో పిల్లల్లో ఇమ్యూనిటీ లోపిస్తుంది. అంతే కాకుండా పలు రకాల అనారోగ్య సమస్యలు, ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలు కూడా పెరుగుతాయని తేలింది. అంతే కాకుండా రేడియేషన్ చేయించుకున్నప్పుడు.. ఈ ప్రభావం కారణంగా పాల ఉత్పత్తి ఉండదు.

అయితే క్యాన్సర్ ఎఫెక్ట్ లేని మరో రొమ్ముతో పాలు ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే క్యాన్సర్ చికిత్స పూర్తి అయిన మూడు నెలల తర్వాత పిల్లలకు పాలు ఇస్తే చాలా మంచిది. ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న తల్లలు.. పిల్లలకు పాలు ఇవ్వడం లేదని చింతించాల్సిన అవసరం లేదు. ఇతర తల్లుల పాలు కూడా మీ బిడ్డకు ఇవ్వొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ తో ఉన్న తల్లులు మీ బిడ్డ కోసమే పాలు ఇవ్వడం లేదన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. పిల్లలకు పాలు ఎలా ఇస్తే మంచిదో.. వైద్యుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker