News

హీరోయిన్ భూమిక భర్త బ్యాక్ గ్రౌండ్ ఎంత పెద్దదో తెలిస్తే షాక్ అవుతారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ,మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అలా కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో భూమిక పెళ్లి చేసుకుంది. 2007లో భరత్ ఠాకర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే వీరిద్దరి ది ప్రేమ వివాహమట. భరత్ ఠాకూర్ భూమిక యోగా టీచర్. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోయిన్స్ వచ్చినా కొంతమంది హీరోయిన్లు మాత్రం ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేస్తుంటారు.

వీళ్ళు అవకాశాల కోసం అందాల ఆరబోతలు చెయ్యడానికి సిద్ధమయ్యే హీరోయిన్స్ అసలు కాదు, వాళ్ళు గీసుకున్న గీత నుండి బయటకి రారు. నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే పోషిస్తారు, అందుకే ఈ హీరోయిన్స్ ఇప్పటికీ ఇండస్ట్రీ లో కొనసాగుతూనే ఉన్నారు, అలాంటి హీరోయిన్స్ లో ఒకరు భూమిక. అప్పట్లో ఈమె ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో మన అందరికీ తెలిసిందే.

నేటి తరం టాప్ 3 హీరోలైన పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మరియు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్స్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన ఖుషి , ఒక్కడు మరియు సింహాద్రి చిత్రాలలో హీరోయిన్ ఈమెనే. ఆ తర్వాత తెలుగు , తమిళం , హిందీ మరియు మలయాళం సినిమాలలో ఎంతోమంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన ఈమె, ఇప్పటికీ పాన్ ఇండియా లెవెల్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉండగా భూమిక 2007 వ సంవత్సరం లో భరత్ ఠాకూర్ అనే అతనిని పెళ్లి చేసుకుంది.

వీళ్లిద్దరి లవ్ మ్యారేజ్,అయితే భరత్ ఠాకూర్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. భరత్ ఠాకూర్ ఒక యోగా అనలిస్ట్ మరియు పెద్ద వ్యాపారవేత్త కూడా, ఈయన గ్లోబల్ చైన్ ఆర్టిస్టిక్ యోగా సంస్థలకు చైర్మన్, అలాగే ఈయనకి బ్రీత్ అనే వెల్నెస్ మరియు లైఫ్ స్టైల్ బ్రాండ్ కంపెనీ కి అధినేత కూడా, యోగా మీద ఈయన ఎన్నో పుస్తకాలూ కూడా రాసాడు. వీటితో పాటు ఆయనకీ ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయి.

వాటి ద్వారా ఈయన వేల కోట్ల రూపాయిలు సంపాదించాడట, ఇండియాలోనే అత్యధిక ధనవంతులలో ఈయన కూడా ఒకడు అని అంటుంటారు.ఈయన బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ తెలుసుకొని నెటిజెన్స్ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు, ఇంత ధనవంతుడికి భార్య అయినా కూడా, సినిమాల మీద ప్యాషన్ తో ఇప్పటికీ సినిమాలు చేస్తున్నందుకు భూమిక ని ప్రశంసిస్తున్నారు ఫ్యాన్స్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker