News

బిగ్ బాస్ ఇప్పటివరకు నాగార్జునకి ఎన్ని వందల కోట్లు ఇచ్చారో తెలుసా..?

నాగార్జున గత ఐదు సీజన్స్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఐదు సీజన్స్‌కు కలిపి ఇప్పటి వరకు నాగార్జునకు అందిన రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సీజన్ 3 నుండి ఆయన వరుసగా బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తున్నారు. ఆయన సారథ్యంలో షో మంచి టీఆర్పీ రాబడుతుంది. ఒక్క సీజన్ 6 మినహాయిస్తే అన్ని సీజన్స్ విజయం సాధించాయి.

సీజన్ 7 అయితే బ్లాక్ బస్టర్. కాగా బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున రెమ్యునరేషన్ ఎంత? సీజన్ కి ఆయన ఎంత తీసుకుంటున్నారు? అనే సందేహాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దాని ప్రకారం బిగ్ బాస్ షో యాజమాన్యం నాగార్జునకు భారీగానే చెల్లిస్తున్నారు.

గత ఐదు సీజన్స్ కి హోస్టింగ్ చేసిన నాగార్జున మొత్తంగా రూ. 140 కోట్లు తీసుకున్నాడని సమాచారం. అంటే సరాసరిన ఒక సీజన్ కి నాగార్జున రూ. 28 కోట్లు తీసుకుంటున్నారు. సినిమా రెమ్యూనరేషన్ కంటే ఇది చాలా ఎక్కువ. నాగార్జున ప్రస్తుత మార్కెట్ రీత్యా ఆయన రెమ్యూనరేషన్ కనీసం పది కోట్లు కూడా లేదు.

కానీ బిగ్ బాస్ హోస్ట్ గా దాదాపు ముప్పై కోట్ల వరకు తీసుకుంటున్నారట. దీనిపై స్పష్టమైన సమాచారం లేకున్నప్పటికీ వైరల్ అవుతుంది. మరోవైపు ఈ షో బ్యాన్ చేయాలనే డిమాండ్ ఉంది. సాంప్రదాయవాదులు విమర్శలు చేస్తున్నారు. హోస్ట్ గా నాగార్జున విమర్శలపాలవుతున్నారు.

నాగార్జున ఇంటి ఎదుట ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా నాగార్జున షో వదల్లేదు. సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడం, అన్నపూర్ణ స్టూడియో ఎదుట అల్లర్లు ఈ షో పరువు మరింత తీశాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker