Health

వారానికోసారైనా బ్లాక్‌రైస్‌ తింటే చాలు,ఆ రోగాన్నిటికీ ఔషధంగా పనిచేస్తుంది.

బీపీ, షుగర్ రోగాలు ఉన్న వారికి ఈ బ్లాక్ రైస్ అద్భుత ఔషధంగా పనిచేస్తున్నాయి. దీంతో నల్లధాన్యం పండించే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. కాలం మారింది. చైనా నుంచి వచ్చి బ్లాక్ రైస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మారిన జీవన శైలితో జనాభాలో సగంమంది బీపీ, షుగర్ తో బాధపడుతున్నారు. ఇలాంటి వారు అన్నం తినవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే బ్రౌన్ రైస్, వైట్ రైస్ మాత్రమే ఇప్పుడు అధికంగా మనం తింటున్నాం. బ్రౌన్ రైస్ తినే వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఆరోగ్యకరమైన బియ్యం రకాల్లో నల్ల బియ్యం కూడా ఒకటి.

చూడడానికి నల్లగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది తినేందుకు ఇష్టపడరు. కానీ వీటిని వారానికి ఒక్కసారి అయినా తినాల్సిన అవసరం ఉంది. ఈ బియ్యం లో అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో ప్రోటీన్లు, పోషకాలు అందుతాయి. ఇటలీ, చైనాలలో అధికంగా నలుపు బియ్యాన్ని తినడానికి ఇష్టపడతారు. మనదేశంలో మాత్రం వీటి వాడకం తక్కువగా ఉంది. కారణం దీని నలుపు వర్ణమే. రంగును చూసి తినడం మానేస్తే ఎన్నో పోషకాలను నష్టపోతారు.

కాబట్టి కచ్చితంగా బ్లాక్ రైస్‌తో రోజుకు ఒక్కసారైనా భోజనం తినేందుకు ప్రయత్నించండి. మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కావాలి. కాబట్టి ఈ నల్ల బియ్యాన్ని తెచ్చుకుంటే మన శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ బియ్యాన్ని తినడం వల్ల వయసు పెరగడం వల్ల వచ్చే వ్యాధుల నుండి ఉపశమనం పొందొచ్చు. ఈ బియ్యం తినడం వల్ల బరువు కూడా పెరగరు. ఎందుకంటే దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ గింజలోపల ఉండే గ్లూకోజ్ ను శరీరం శోషించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.

కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలో అమాంతం పెరగవు. చాలా మెల్లగా పెరుగుతాయి. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది పొట్ట త్వరగా నిండేలా చేస్తుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది. తద్వారా బరువును కూడా తగ్గిస్తుంది. ఆంథోసైనిన్స్ అని పిలిచే యాంటీఆక్సిడెంట్ లో దీనిలో అధిక స్థాయిలో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ మెదుడు పనితీరుకు చాలా ముఖ్యం. ఇన్ఫ్లమేషన్ నుంచి ఇది మెదడును కాపాడుతుంది.

గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఇది అడ్డుకుంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను పెరగకుండా చూసుకుంటుంది. కంటి ఆరోగ్యానికి కూడా బ్లాక్ రైస్ ఎంతో మేలు చేస్తుంది. ఈ బ్లాక్ రైస్ లో కెరటనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి కళ్ళను కాపాడతాయి. సాధారణ వైట్ రైస్ తో ఎలాంటి వంటకాలు చేసుకోవచ్చు. బ్లాక్ రైస్ తో కూడా అవన్నీ వండుకోవచ్చు. ఇవి చూడడానికి నలుపుగా ఉన్న రుచి మాత్రం అదిరిపోతుంది. ఒక్కసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తెచ్చుకొని తింటారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker