Health

ఈ కాలంలో ఈ పానీయాలు తాగితే పొట్టలో పేరుకుపోతున్న కొవ్వు మొత్తం కరగడం ఖాయం.

శరీరంలో పేరుకుపోతున్న కొవ్వును కరిగించాలంటే… రుతువులకు తగ్గట్టు లభించే కూరగాయలు, పండ్లు, పీచుపదార్థాలు కలిగిన ఆహార పదార్థాలను సేవిస్తుండాలి. ముఖ్యంగా క్రమంతప్పకుండా వారానికి ఒకసారి సగ్గు బియ్యం ఉడకబెట్టుకుని అందులో పాలు, చక్కెర కలుపుకుని సేవిస్తే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందంటున్నారు వైద్యులు. అయితే వేసవితో పోలిస్తే చలికాలంలో బరువు పెరిగిపోయే వారి సంఖ్య అధికంగా ఉంది.

చలి వల్ల వ్యాయామం చేయకపోవడం, ఆహారం ఎక్కువగా తినాలనిపించడం, స్పైసి ఫుడ్ తినాలన్న కోరికలు పెరగడం వంటివన్నీ చలికాలంలో బరువు పెరగడానికి కారణమవుతున్నాయి. ఒక గ్లాసు పాలను వేడి చేసి అందులో ఒక స్పూను పసుపు కలుపుకోవాలి. నల్ల మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. దీన్ని ప్రతి రోజు తాగుతూ ఉండాలి. దీనివల్ల కొవ్వు త్వరగా కరిగిపోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆకలి తక్కువగా వేస్తుంది. చలికాలంలో ఖచ్చితంగా తినాల్సిన పదార్థాలలో అల్లం ఒకటి.

నీటిలో అల్లం తరుగును వేసి మరిగించాలి. ఆ నీటిని వడకట్టి ఒక గ్లాసులో వేయాలి. కాస్త నిమ్మరసం, తేనె కలుపుకొని దాన్ని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి. పొట్ట దగ్గర కొవ్వు చేరే అవకాశం తగ్గుతుంది. నీటిలో ఒక స్పూను దాల్చిన చెక్క పొడిని వేసి మరిగించాలి. తర్వాత దాన్ని గ్లాసులో వేసి ఒక స్పూన్ తేనె కలుపుకోవాలి. ఆ పానీయాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆహారాన్ని తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది.

కాబట్టి అధిక బరువుతో బాధపడుతున్న వారు, మధుమేహం ఉన్నవారు ఈ దాల్చిన చెక్కతో చేసిన పానీయాన్ని తాగడం అవసరం. గ్రీన్ టీని ప్రతి ఒక్కరూ తాగాల్సిన అవసరం ఉంది. గ్రీన్ టీని మరీ వేడిగా తాగడం వల్ల ఉపయోగం ఉండదు. గోరువెచ్చగా మారాక అందులోని ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూను తేనె కలుపుకొని తాగితే మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి.

ప్రతిరోజూ ఉదయం లేవగానే ఒక కప్పు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మ చెక్క నుంచి తీసిన రసాన్ని వేసి బాగా కలపాలి. అందులోనే ఒక స్పూన్ తేనె, చిటికెడు మిరియాల పొడి కూడా వేసి తాగాలి. ఇది జీవక్రియ వేగాన్ని పెంచుతుంది. ఆహారాన్ని పూర్తిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అది కొవ్వుగా పేరుకోకుండా అడ్డుకుంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker