Health

మహిళలు తెలియకుండా చేసే ఈ చిన్న తప్పు వల్ల రొమ్ము క్యాన్సర్ భారిన పడుతున్నారు.

రొమ్ము కాన్సర్ ఒక ప్రాణాంతకమైన వ్యాధి. ఇది అత్యధికంగా స్త్రీలకు వచ్చే వ్యాధి. బాధితుల రొమ్ము లేదా చంకలో ఏర్పడే గడ్డ పూర్తిగా నయం కాదు. ఇది రొమ్ము క్యాన్సర్ మొదటి లక్షణం. ఈ గడ్డను బాధితులు గుర్తించడానికి ముందే వైద్యులు మామోగ్రామ్‌లో వీటిని గుర్తించవచ్చు. అయితే ఏ మహిళలైతే ఎలాంటి వ్యాయామం చేయకుండా ఎక్కువ సేపు కూర్చోవడానికి, పడుకోవడానికి ఇష్టపడతారో… వారు రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా ఆఫీసులో పని చేస్తున్న మహిళలు ఎక్కువ సేపు కూర్చొని ఒకే భంగిమలో పనిచేస్తారు. ఇలా చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. సాధారణ మహిళలతో పోలిస్తే రోజులో ఎక్కువ సేపు కూర్చునే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 40 శాతం పెరుగుతుందని కొత్త అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనాన్ని జపాన్లోని క్యోటో యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించారు.

కేవలం కూర్చోవడమే కదా అని మీకు అనిపించవచ్చు, కానీ ఆ కూర్చోవడమే మీకు రొమ్ము క్యాన్సర్‌ను తెచ్చి పెట్టడం అనేది భయపెట్టే అంశమే. ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాల పనితీరు మారిపోతుంది. ఇది రక్త ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. రోజుకు ఏ మహిళలైతే ఏడుగంటలకు పైగా కూర్చుంటారో, వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ.

కాబట్టి గంటలు గంటలు ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి వాకింగ్, రన్నింగ్ వంటివి చేయడం చాలా అవసరం. అధ్యయనంలో భాగంగా 36 వేల మంది మహిళలపై పరిశోధన చేశారు. వీరిలో 35 ఏళ్ల నుంచి 69 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం 18 ఏళ్ల నుండి 64 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు కచ్చితంగా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. మీరు వారానికి కనీసం 150 నుండి 300 నిమిషాల వరకు వ్యాయామానికే కేటాయించాలి.

ఇటీవల ఒక అధ్యయనం వ్యాయామం చేయడానికి ఏది ఉత్తమ సమయమో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అధ్యయనం ప్రకారం ఉదయమే వ్యాయామానికి ఉత్తమ సమయం. ఉదయం చేసే వ్యాయామం బరువును త్వరగా తగ్గిస్తుంది. దాదాపు 5,280 మందిపై అమెరికాలో ఈ అధ్యయనాన్ని నిర్వహించి, ఈ ఫలితాన్ని తేల్చారు. కాబట్టి మహిళలు ఒకే చోట ఎక్కువసేపు కూర్చోకుండా మధ్య మధ్యలో నడవడం, ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు చేయడం చాలా అవసరం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker