శరీరాన్ని చల్లబరిచి వేసవి వేడి వల్ల వచ్చే ఎన్నో ఆరోగ్యసమస్యలకు పాతకాలం నాటి అద్భుతమైన చిట్కా.

వట్టి వేర్లు మంచి సువాసన, ఔషధగుణాలతోపాటు, చల్లదనాన్నీఇస్తాయి. ఈ వేర్లతో తయారుచేసిన చాపలను కిటికీలకు కట్టుకుంటారు. దీని వల్ల ఇంట్లోకి వేడిగాలికి బదులు చల్లని గాలి వస్తుంది. అంతేకాకుండా కూలర్లలో సైతం వీటిని వాడతారు. దాహం తీర్చుకునేందుకు, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు వట్టి వేర్ల నీటిని తాగటం మంచిది. ఒత్తిడి,ఆందోళన వంటి వాటిని తగ్గించటంతోపాటు, మానసిక ప్రశాంతత కలిగించటంలో వట్టివేళ్లను మించిందిలేదని చెప్పవచ్చు. అయితే వేసవికాలం సమీపించే కొద్దీ శరీరంలో వేడి పెరుగుతుంది.
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. డీహైడ్రేషన్ ను నివారించడానికి నీరు ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. వేసవిలో ఎండవేడి నుండి శరీరాన్ని చల్లబరుచుకునేందుకు మార్కెట్‌లో అందుబాటులో ఉండే కృత్రిమంగా రుచులతో కూడిన రంగుల పానీయాలను తీసుకుంటుంటారు. వాటికి బదులుగా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న హైడ్రేటెడ్ వట్టివేర్ల షర్బత్ వంటి సహజ శీతలకరణిలను ఎంచుకోవటం మంచిదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భారతదేశంలో శతాబ్దాలుగా వేడిని తగ్గించుకోవటానికి వట్టివేర్లతో షర్బత్ తయారు చేసుకుని సేవిస్తున్నారు. ఈ షర్ఫత్ ప్రయోజనాలు కేవలం వేడి నుండి ఉపశమనాన్ని అందించడంతోపాటు ఇతర అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వట్టివేర్ల షర్బత్ వట్టివేర్ల కాచిన కషాయం, చక్కెర, నీరు మరియు నిమ్మకాయలతో తయారు చేస్తారు. ఆకుపచ్చ రంగు మిశ్రమం. వట్టివేర్లతో దీనిని తయారు చేస్తారు. అధిక దాహం, డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది.. వట్టివేర్ల షర్బత్ లో శీతలీకరణ గుణాలు ఉన్నాయి. దాహాన్ని తీర్చడంలో సహాయపడతాయి. హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ.. ప్రశాంతమైన, శీతలీకరణ ప్రభావం కారణంగా, వట్టివేర్ల షర్బత్ వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా నాడీ, ప్రసరణ వ్యవస్థలలో వడదెబ్బ, నిర్జలీకరణం , వడగాల్పుల వల్ల కలిగే మంటకు ఇది సమర్థవంతమైన చికిత్సగా సహాయపడుతుంది. కళ్లుమండటం, ఎరుపెక్కటాన్ని తొలగిస్తుంది.. వట్టివేర్లలో జింక్ సమృద్ధిగా ఉంటుంది, ఇది అనేక కంటి పరిస్థితులను నివారించడంలో సహాయపడుతుంది. దాని శీతలీకరణ ప్రభావాల కారణంగా, వేసవిలో ఈషర్బత్ తీసుకోవడం వల్ల అధిక వేడి కారణంగా కళ్ళు ఎర్రబడటం తగ్గుతుంది.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.. వట్టివేర్లు ఇనుము, మాంగనీస్ మరియు విటమిన్ B6 యొక్క అద్భుతమైన మూలం, ఇది శరీరం అంతటా రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.. వట్టివేర్లలోని అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కణజాలాలు, అవయవాలకు ఫ్రీ-రాడికల్ నష్టాన్ని నివారిస్తుంది. నిద్రలేమిని తగ్గించటంలో సహాయపడుతుంది.. వట్టివేర్లలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడం ద్వారా , శాంతపరిచే లక్షణాల వల్ల నిద్రలేమి సమస్యను పోగొడుతుంది.

కిడ్నీ రాళ్లను నివారించడంలో.. వట్టివేర్లలో ఆక్సలేట్‌లు ఉన్నాయి, ఇవి రక్తం నుండి అదనపు కాల్షియంను గ్రహించడంలో సహాయపడతాయి, కాల్షియం నిక్షేపాలు,స్ఫటికీకరణను నివారిస్తాయి. నొప్పిని తగ్గిస్తుంది.. వట్టివేర్లు అనాల్జేసిక్, మార్ఫిన్ కంటెంట్ కారణంగా నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి వట్టివేర్ల షర్బత్ ను మన రోజువారి దినచర్యలో సులభంగా చేర్చవచ్చు. ఈ పానీయంగా సేవిస్తే వేడిని అధిగమించడానికి ,మొత్తం ఆరోగ్యం బాగుండటానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది.