Health

పుచ్చకాయ తిన్నతరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ తప్పులు చేయొద్దు. ఎందుకంటే..?

ఎండాకాలంలో మన శరీరం తరచూ నీటిని కోల్పోతుంది. అందువల్ల దాహం ఎక్కువగా వేస్తుంది. అయితే చాలా మంది ఫ్రిజ్‌లో నీళ్లు లేదా వివిధ రకాల కూల్‌డ్రింక్స్ తాగితే దాహం తీరుతుందని భావిస్తారు. కానీ శరీరంలో వాటర్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ముక్కలు తినడం బెస్ట్ ఆప్షన్ అని వైద్యులు సూచిస్తున్నారు. పుచ్చకాయలో ఉండే విటమిన్లు, పోషకాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటి ఆక్సిడెంట్లు, బీ విటమిన్, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, జిటాకేరోటిన్లు, ఆల్కలైన్, విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ సి, సుక్రోజ్ , ఫ్రక్టోజ్, గ్లూకోజ్, ఎలక్ట్రో లైట్లు…

ఎండాకాలంలో మన శరీరానికి కావాల్సిన పోషకాల్ని అందిస్తాయని వాళ్లు వివరిస్తున్నారు. అయితే రుచికరమైన పుచ్చకాయ తినడం అంటే అందరికి ఇష్టం. ముఖ్యంగా వేసవి కాలంలో పుచ్చకాయ తినటం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వేడి ఉష్ణోగ్రతల నుండి శరీరాన్ని చలబరిచేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అయితే చాలా మంది పుచ్చకాయ తిన్న తరువాత కొన్ని రకాల తప్పులు చేస్తుంటారు. అలాంటి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయ తిన్న తరువాత కొన్ని ఆహారాలను తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదట.

ఒక వేళ తీసుకుంటే మాత్రం కడుపులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. పుచ్చకాయతో కొన్ని రకాల ఆహారపదార్ధాల కలయిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పుచ్చకాయ తిన్న తర్వాత పాలకు దూరంగా ఉండండి.. పుచ్చకాయ తిన్న తర్వాత పాలు తీసుకోవడం ఆరోగ్యపరంగా అనేక విధాలుగా హానికరం. వాస్తవానికి, పుచ్చకాయలో విటమిన్ సి ఉంటుంది. పుచ్చకాయ తిన్న తర్వాత పాల ఉత్పత్తులను తిన్నప్పుడు, అవి ఒకదానితో ఒకటి స్పందించి కడుపు ఉబ్బరం కలిగిస్తాయి.

ఇలా అవి జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. అజీర్ణానికి కారణమవుతాయి. పుచ్చకాయ తిన్న తర్వాత ప్రొటీన్ ఫుడ్స్.. పుచ్చకాయ తిన్న తర్వాత ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల హాని కలుగుతుంది. నిజానికి, పుచ్చకాయలో విటమిన్లు , ఖనిజాలు ఉంటాయి. కొంత పిండిపదార్థం కూడా ఉంటుంది. పప్పులు వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తీసుకోవడం జీర్ణ ఎంజైమ్‌లను దెబ్బతీస్తుంది. కడుపుకు హానికరం. పుచ్చకాయ తిన్న తర్వాత గుడ్డు వద్దు.. పుచ్చకాయ తిన్న తర్వాత గుడ్డు తినడం వల్ల అనేక పొట్ట సమస్యలు వస్తాయి.

వాస్తవానికి, ప్రోటీన్‌తో పాటు, గుడ్లలో ఒమేగా-3 వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. పుచ్చకాయ నీరు అధికంగా ఉండే పండు. ఈ రెండూ ఒకదానికి ఒకటి కలిస్తే జీర్ణం కాకుండా నిరోధిస్తాయి. తరువాత అవి కడుపులో ఉబ్బరం, మలబద్ధకం కలిగిస్తాయి. కాబట్టి, పుచ్చకాయ తిన్న తర్వాత ఈ ఆహారాలను తీసుకోకుండా ఉండటం మంచిది. ఇది కాకుండా, పుచ్చకాయ తిన్నప్పుడల్లా, దాదాపు 30 నిమిషాల వరకు ఏమీ తినకండి. ఇలా చేయటం వల్ల దానిలోని పోషకాలను శరీరం గ్రహిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker