Health

డెంగ్యూ, మలేరియాతో సహా 4 ప్రాణాంతక వ్యాధులకు ఈ పచ్చి ఆకు రసం దివ్యౌషధం.

బొప్పాయి ఆకుల నిండా ఔషధ గుణాలే. అందుకే ఆయుర్వేద మందుల్లో దాన్ని వాడుతారు. బొప్పాయి గింజలు కూడా అనేక రకాలుగా ఉపయోగ పడతాయి. బొప్పాయి ఆకులు తినడానికి చేదుగా ఉన్నా ప్రయోజనాలు మాత్రం మెండుగా ఉన్నాయి. అయితే బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా వ్యాధులకు బొప్పాయి తినమని వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు. బొప్పాయి కడుపు, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి ఔషధంలా పనిచేస్తుంది. బొప్పాయి మాత్రమే కాదు, బొప్పాయి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ఈ ఆకులలో విటమిన్ ఎ, సి, ఇ, కె, బి12, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయి ఆకుల్లో ఉండే ఈ లక్షణాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. దీని రసం తాగడం వల్ల 5 ప్రధాన వ్యాధులు నయమవుతాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రజలు డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా వంటి విష జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసి పోతున్నాయి.

డెంగ్యూ, మలేరియా కారణంగా ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. అయితే ఏడిస్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. ఈ డెంగ్యూ జ్వరం సాధారణ జ్వరం కంటే చాలా ప్రమాదకరం. డెంగ్యూలో, రక్తంలో ప్లేట్‌లెట్స్ చాలా వేగంగా తగ్గుతాయి. అటువంటి పరిస్థితిలో బొప్పాయి ఆకులు డెంగ్యూ రోగులకు దివ్యౌషధంగా పనిచేస్తాయి.

ఈ ఆకుల రసాన్ని తాగడం వల్ల ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా పెరుగుతుంది. అంతేకాదు..బొప్పాయి ఆకులు డెంగ్యూ, మలేరియా రెండింటిలోనూ ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఈ ఆకులో ఉండే లక్షణాలు మలేరియాతో పోరాడటానికి సహాయపడతాయి. బొప్పాయి ఆకుల రసాన్ని మలేరియా రోగులకు తాగిస్తూ ఉంటే.. క్రమంగా మలేరియా లక్షణాలు తగ్గుముఖం పడతాయి. బొప్పాయి ఆకులు మధుమేహ రోగులకు కూడా చాలా మేలు చేస్తాయి.

దీని రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ ఆకులు మధుమేహానికి కూడా మంచి ఔషధంగా పనిచేస్తాయి. బొప్పాయి ఆకు రసం తాగడం వల్ల షుగర్ పెరగకుండా చూసుకోవచ్చు. అంతేకాదు..జీర్ణ సమస్యలకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయి ఆకు రసం జీర్ణ సమస్యలు, కాలేయం, జుట్టు పెరుగుదల, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker