Health

అబ్బాయిలూ ఈ వర్కవుట్ రోజు చేస్తే మీరు 50 ఏళ్లయినా ఫిట్‌గా ఉంటారు.

కొంతమంది జిమ్‌కి వెళ్లే బదులు ఇంట్లో లేదా పార్కులో వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు. అయితే వ్యాయామం చేయడం ద్వారా మిమ్మల్ని మీరు ఎంతకాలం ఫిట్‌గా ఉంచుకోవచ్చు అనే విషయంలో చాలా మందిలో ఓ కన్ఫ్యూజన్ ఉంది. కొంతమంది ఇంటర్నెట్‌లో దీని గురించి సెర్చ్ కూడా చేస్తున్నారు. GFFI ఫిట్‌నెస్ అకాడమీట్రైనర్ పంకజ్ మెహతా మాట్లాడుతూ.. సాధారణంగా ప్రతి రోజూ వ్యాయామం యొక్క సమయం 1 నుండి ఒకటిన్నర గంటలు ఉంటుంది, అయితే రోజూ ఆఫీసులకు వెళ్లడం, ఇంటికి కావాల్సిన విషయాల్నింటినీ చూసుకోవడం, వ్యాపారాలను చక్కబెట్టుకోవడం లాంటి విషయాల్లోనే మగవారంతా తలమునకలై ఉంటారు.

వయసులో ఉన్నప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే వ్యాయామాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. బరువు పెరిగితేనో, ఆరోగ్య సమస్యలు వస్తేనో తప్ప మనకెందుకు ఎక్స్‌ర్‌సైజులు అనుకుంటారు. అయితే సుదీర్ఘ కాలం పాటు అంటే 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆనందంగా ఉండాలంటే అబ్బాయిలంతా కచ్చితంగా రోజూ కొన్ని వ్యాయామాలు చేయాల్సిందే అంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. పులప్స్‌..పొట్టకు పై భాగంలో ఉండే శరీరాన్ని బలోపేతం చేయడంలో పుల్‌ అప్స్‌ ఎంతగానో సహకరిస్తాయి. వీటి వల్ల వీపు, భుజాలు, చేతులు బలోపేతం అవుతాయి. కండరాలు శక్తివంతం అవుతాయి.

వీటి వల్ల నిత్య జీవితంలో బరువుల్ని ఎత్తడం, అన్ని రకాల పనులను చక్కబెట్టుకోవడం లాంటివి తేలిక అవుతాయి. అంతేకాకుండా వీటిని చేయడం వల్ల జీవ క్రియ వేగవంతం అవుతుంది. దీంతో బరువునూ నియంత్రణలో ఉంటుంది. అయితే వీటిని చేయడానికి ముందు కొన్ని వార్మప్‌ వ్యాయామాలు చేయడం మాత్రం మర్చిపోకూడదు. స్క్వాట్స్‌..నిలబడిన తర్వాత నడుము, తుంటి భాగాన్ని కిందికి వంచడం, మళ్లీ యధాస్థితికి తేవడం ద్వారా స్క్వాట్స్‌ చేస్తారు కదా. ఇవి చేయడం వల్ల నిలబడటంలో బ్యాలెన్స్‌ మెరుగవుతుంది. తొందరగా కింద పడి దెబ్బలు తగిలించుకునే ప్రమాదాలు తగ్గుతాయి.

మన శరీర స్థితి బాగు పడుతుంది. డెడ్‌ లిఫ్ట్స్‌..జిమ్ముల్లో బార్బెల్స్‌ ఉంటాయి కదా. వాటిని ఎత్తే ప్రయత్నం చేయండి. అందుకు జిమ్ము వరకు వెళ్ల లేని వారు కొంత బరువుల్ని తెచ్చి ఇంట్లోనే పెట్టుకోండి. వాటితోనే వర్కవుట్లు చేయండి. ఇవి మన శరీరం మొత్తంలో ఉన్న కండరాల్ని చాలా దృఢంగా మారుస్తాయి. వయసు మీద పడే కొద్దీ మజిల్‌ లాస్‌ ఉంటుంది. కండరాలు బలహీనంగా మారతాయి. అయితే క్రమం తప్పకుండా ఇవి చేయడం వల్ల వయసు మీద పడినా బలంగా ఉండగలుగుతారు. బరువులు మోయండి.

ఇంట్లోకి కావాల్సిన బియ్యం బస్తాలు, గ్యాస్‌ సిలెండర్లు లాంటివి మోయడానికి ఎక్కువ బరువుగా ఉంటాయి. అయితే ఈ పనులు చేయడానికి వేరే వాళ్లని పిలవకండి. మీకు మీరుగా వీటిని ఎత్తి పెట్టడం అలవాటు చేసుకోండి. దుకాణాల దగ్గర నుంచి బరువులు పట్టుకుని నడుస్తూ ఇంటికి రండి. అందుకు స్కూటర్లు, మోటార్‌ బైక్‌లు, కార్లను వాడటం మానేసి చూడండి. దగ్గర్లో ఉన్న ఏ దుకాణానికి వెళ్లాల్సి వచ్చినా కాలి నడకనే వెళ్లండి తప్ప వీటిని వాడకండి. ఇది చేయక్కర్లేకుండానే వ్యాయామం ఇచ్చినంత ఫలితాన్ని ఇస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker