ఇంట్లో వాళ్ళు ఒప్పుకొకపొయిన బ్రహ్మానందం “ఇంటర్‌క్యాస్ట్” ఎందుకు చేసుకున్నారో తెలుసా..?
కన్నెగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. అయితే బ్రహ్మానందం ఎన్నో కష్టనష్టాలను దాటుకొని చదివి కాలేజీ లెక్చరర్ గా జాబ్ సంపాదించారు. అత్తిలిలో లెక్చరర్ గా చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. చిన్నప్పట్నుంచి పేద కుటుంబం అవ్వడం, బ్రహ్మానందం కష్టపడి చదువుకొని లెక్చరర్ జాబ్ తెచ్చుకోవడంతో కట్నం కోసం కూడా చూసారు తల్లితండ్రులు.
అయితే చదువుకి డబ్బుల విషయంలో బ్రహ్మానందంకి హెల్ప్ చేసిన అనసూయమ్మ అనే ఆవిడ బ్రహ్మానందం కోసం ఓ సంబంధం తెచ్చింది. ఆమె భర్త చెల్లిళ్లలో ఒకరైన లక్ష్మిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని బ్రహ్మానందంకి సలహా ఇచ్చారు ఆవిడ. బ్రహ్మానందంకి, లక్ష్మికి ముందే ముఖ పరిచయం ఉంది. అనసూయమ్మ గారు బ్రహ్మానందంకి చాలా సహాయం చేయడం, లక్ష్మి మంచి అమ్మాయి అని తెలుసు కాబట్టి ఆవిడని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాడు బ్రహ్మానందం.
కానీ ఇంట్లో చెప్తే వేరే క్యాస్ట్ అని ఒప్పుకోకుండా పెద్ద గొడవ చేశారు. బ్రహ్మానందం వాళ్ళు విశ్వ బ్రాహ్మణులు అయితే, లక్ష్మి వాళ్ళు కాపులు. అందులోను కట్నం లేకుండా పెళ్లి. దీంతో బ్రహ్మానందం ఇంట్లో ససేమీరా ఒప్పుకోలేదు. చాలా ట్రై చేసాడు బ్రహ్మానందం అయినా ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకుంటే లక్ష్మిని చేసుకుంటాను లేకపోతే జీవితంలో అసలు పెళ్లి చేసుకోను అని చెప్పడంతో ఏం చేయాలో తెలియక వాళ్ళ తల్లితండ్రులు ఒప్పుకున్నారు.
బ్రహ్మానందంకి ఇష్టమైన వేంకటేశ్వరస్వామి ఆలయంలో వీరి పెళ్లి 1977 డిసెంబర్ 14న జరిగింది. అప్పుడున్న జీతంతో ఇద్దరూ బతకడం కష్టం అయినా లక్ష్మి సహకారం వల్లే ఆయన ఇంత సాధించానని, ఆమె ఇంటిని చక్కదిద్దింది అని చెప్పారు బ్రహ్మానందం. దీంతో బ్రహ్మానందం రాసిన పుస్తకంలోని అనేక విశేషాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.