News

మహిళలకు గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు.

బంగారం ధరలు పడిపోతూనే వస్తున్నాయి. పసిడి రేటు క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. కొత్త ఏడాది ఆరంభంలోనే బంగారం ధరలు దిగి రావడం సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. అలాగే సంక్రాంతి ముందు పసిడి వెలవెలబోవడం వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు గత మూడు రోజులుగా తగ్గుతూనే వస్తున్నాయి. బంగారం కొనే ఆలోచనలో ఉన్న వారికి ఇది తీపికబురు అని చెప్పుకోవచ్చు.

బంగారం ధరలు తగ్గితే.. వెండి రేట్లు కూడా ఇదే దారిలో నడిచాయని చెప్పుకోవచ్చు. అయితే బంగారం ధరలు మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న ఉదయం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400, 24క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.440 తగ్గిన విషయం తెలిసిందే. నిన్నటి కంటే ఇవాళ బంగారం ధరలు మరింత తగ్గాయి.

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న ఇదే సమయానికి రూ.58,100గా ఉండగా, ఇవాళ ఉదయం రూ.100 తగ్గి రూ.58,000గా కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 10 గ్రాములకు రూ.63,380గా ఉండగా, నేడు రూ.110 తగ్గి రూ.63,270గా ఉంది.

వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర నిన్న ఇదే సమయానికి రూ.78,000గా ఉంది. ఇవాళ కూడా ఉదయం 6 గంటల నాటికి అదే ధర కొనసాగుతోంది. పసిడి, వెండి ధరలు తగ్గుతుండడంతో వాటిని కొనడానికి ఇదే మంచి సమయం.

కాగా, బంగారం, వెండి ధరలు ఇవాళ రాత్రి వరకు ఒకేలా ఉండవు. మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రాంతాల వారీగానూ బంగారం, వెండి ధరలు మారుతుంటాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker